యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత డొమినిక్‌ థీమ్‌

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా డొమినిక్‌ థీమ్‌ నిలిచాడు. హోరాహోరీగా సాగిన తుదిపోరులో జ్వెరెవ్‌పై థీమ్‌ అద్భుతమైన విజయం సాధించాడు. ఫైనల్‌లో 2-6, 4-6, 6-3, 7-6 తేడాతో గెలుపొందాడు.........

Updated : 14 Sep 2020 09:30 IST

(Photo:US Open Tennis Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా డొమినిక్‌ థీమ్‌ నిలిచాడు. హోరాహోరీగా సాగిన తుదిపోరులో జ్వెరెవ్‌పై థీమ్‌ అద్భుతమైన విజయం సాధించాడు. ఫైనల్‌లో 2-6, 4-6, 6-4, 6-3, 7-6 తేడాతో గెలుపొందాడు. వరల్డ్‌ నెంబర్‌వన్‌ నోవాక్‌ జొకోవిచ్‌ అనూహ్య నిష్క్రమణతో హాట్‌ ఫేవరెట్‌గా మారిన రెండో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా) అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూ వచ్చాడు. ఆస్ట్రియా నుంచి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

(Photo:US Open Tennis Twitter)

90వ దశకంలో పుట్టి గ్రాండ్‌ స్లామ్‌ నెగ్గిన తొలి ఆటగాడూ డొమినికే కావడం విశేషం. తొలి రెండు సెట్లలో వెనుకబడ్డ థీమ్‌ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాడు. వరుసగా మూడు సెట్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి కెరీర్‌లో తొలి యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ఆటగాడు పుంజుకొని టైటిల్‌ నెగ్గడం యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గ్రాండ్‌ స్లామ్‌ వేటలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరిన థీమ్‌ ఎట్టకేలకు యూఎస్‌ ఓపెన్‌తో ఆ కల నెరవేర్చుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరినప్పటికీ.. నోవాక్‌ జొకోవిచ్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. అంతుకుముందు 2018, 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచాడు.

(Photo:US Open Tennis Twitter)

ఇదీ చదవండి..
అమ్మ కాదు అమ్మాయే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని