కోహ్లీ కెప్టెన్సీకి మాజీ ఓపెనర్‌ మద్దతు 

గౌతమ్‌ గంభీర్‌ వ్యాఖ్యలపై మరో మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీకి మద్దతు తెలిపాడు. ‘సారథి జట్టుకు బలం. కోహ్లీ టీంఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అతని నుంచి గొప్ప విజయాలు చూశాం

Published : 09 Nov 2020 02:01 IST

గంభీర్‌ వ్యాఖ్యలను ఖండించిన సెహ్వాగ్‌

 

ఇంటర్నెట్‌డెస్క్ : టీ20 మెగా లీగ్‌ టైటిల్‌ సాధించడంలో కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టు వరుసగా విఫలం అవుతోంది. ఈ ఏడాది యూఏఈలో జరుగుతున్న లీగ్‌లోనూ ఎలిమినేటర్‌ వరకూ వెళ్లిన బెంగళూరు బ్యాటింగ్‌ వైఫల్యాలతో తక్కువ స్కోరు చేసి హైదరాబాద్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లీ సారథ్యంపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో టీంఇండియా మాజీ ఓపెనర్‌, రెండు సార్లు కోల్‌కతాకు టైటిల్‌ సాధించిపెట్టిన గంభీర్‌ కోహ్లీని తీవ్రస్థాయిలో విమర్శించాడు. ఎనిమిదేళ్లుగా కప్పు గెలవకుండా ఉన్న కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలన్నాడు. లేకపోతే కోహ్లీనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఏటా భారీ అంచనాల నడుమ బరిలోకి దిగే బెంగళూరు జట్టు ఈ ఏడాది ఎక్కువగా కోహ్లీ, డివిలియర్స్‌, యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌పైనే ఆధారపడిన విషయం తెలిసిందే. 

గౌతమ్‌ గంభీర్‌ వ్యాఖ్యలపై మరో మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్సీకి మద్దతు తెలిపాడు. ‘సారథి జట్టుకు బలం. కోహ్లీ టీంఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అతని నుంచి గొప్ప విజయాలు చూశాం. అతను అన్ని ఫార్మాట్లలోనూ మ్యాచులను గెలపించగలడు. లీగ్‌లో తను సారథ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు ఆశించిన మేర రాణించట్లేదు. ఓ కెప్టెన్‌కు మంచి జట్టు ఉండటం అవసరం. బెంగళూరు జట్టు యాజమాన్యం కెప్టెన్సీ మార్పుపై కాకుండా జట్టు కూర్పుపై ఆలోచించాలి’ అని సెహ్వాగ్‌ ఓ ఇంటర్వూలో అన్నాడు.  ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో 15 మ్యాచులాడిన కోహ్లీ 121.35 స్ట్రైక్‌రేట్‌తో 466 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని