
Published : 26 Dec 2020 07:39 IST
వినేశ్ విదేశీ శిక్షణకు నిధులు మంజూరు
దిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విదేశీ శిక్షణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హంగేరీ, పోలెండ్‌లలో వినేశ్ 40 రోజుల శిక్షణ కోసం నిధులు మంజూరు చేసింది. వినేశ్‌తో పాటు కోచ్ వోలర్ ఎకోస్, స్పారింగ్ భాగస్వామి ప్రియాంక ఫొగాట్, ఫిజియో పూర్ణిమ రామన్‌లు హంగేరి వెళ్లనున్నారు. ఈ శిక్షణకు అయ్యే ఖర్చు రూ.15.51 లక్షలు టాప్ పథకం కింద కేంద్రం విడుదల చేసింది. ఈనెల 28 నుంచి జనవరి 24 వరకు బుడాపెస్ట్, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 5 వరకు పోలెండ్‌లో వినేశ్ శిక్షణ తీసుకుంటుంది.
ఇవీ చదవండి..
పంత్, సాహా.. ఇద్దరికీ అన్యాయమే జరిగింది
‘మైండ్ గేమ్’ ఆడితే ఆడనివ్వండి: రహానె
Tags :