కోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తే వాళ్లకి ప్రమాదకరం

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆతిథ్య జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా పైచేయి సాధించడంలో...

Updated : 28 Dec 2020 07:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆతిథ్య జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా పైచేయి సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన అజింక్య రహానె (112)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్ రహానెను కొనియాడాడు. కోహ్లీ గైర్హాజరీలో రహానె శతకం సాధించి జట్టును గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడని పేర్కొన్నాడు.

‘‘అడిలైడ్‌ టెస్టులో చేదు జ్ఞాపకాలను చెరిపేయడానికి రహానె గొప్పగా పోరాడుతున్నాడు. తొలిరోజు ఆటలో వ్యూహాలతో సారథిగా అదరగొట్టిన అతడు, ఆదివారం బ్యాటుతో సత్తాచాటాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాలని రహానె పట్టుదలతో ఉన్నాడు. కోహ్లీ గైర్హాజరీలో జట్టును విజయవంతంగా నడిపించాలని శతకం సాధించాడు. సిరీస్‌లో టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చాడు’’ అని పాంటింగ్ అన్నాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరపరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి భారత క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదుచేసింది.

రహానె.. నయావాల్ పుజారాలా బ్యాటింగ్ చేశాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కొన్ని బౌండరీలు మాత్రమే బాదాడని, ఎక్కువగా డిఫెన్స్‌ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పాడు. కోహ్లీ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. ‘‘విరాట్‌ కోరుకున్నంత కాలం భారత్‌కు అతడే కెప్టెన్‌. అయితే బ్యాటింగ్‌పై మరింత దృష్టిసారించాలని అతడు కెప్టెన్సీని వదిలేస్తే.. ప్రపంచ బౌలర్లకు అది ఎంతో ప్రమాదకరం. కోహ్లీ నాయకత్వ లక్షణాలపై ఎలాంటి సందేహాలు లేవు. ప్రతికూలాంశాల్లో రహానె సత్తాచాటాడని చెప్పడమే నా ఉద్దేశం’’ అని పాంటింగ్ స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి

నాయకుడై నడపించాడు

ధోనీ, కోహ్లీనే ఈ దశాబ్దపు సారథులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని