కోహ్లీలేనంత మాత్రాన కప్పు గెలిచినట్టు కాదు 

రాబోయే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొలి మ్యాచ్‌ మినహా మిగతావి ఆడనంత మాత్రాన తాము కప్పు గెలిచినట్టు కాదని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ అన్నాడు...

Published : 15 Nov 2020 03:20 IST

టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్‌పై నాథన్‌ లయన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొలి మ్యాచ్‌ మినహా మిగతావి ఆడనంత మాత్రాన తాము కప్పు గెలిచినట్టు కాదని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ అన్నాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ ఆడకపోతే సిరీస్‌ నిరుత్సాహంగా ఉంటుందని చెప్పాడు. యూఏఈలో టీ20 లీగ్‌ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు గురువారం నేరుగా సిడ్నీకి చేరుకున్నారు. అక్కడ జట్టు 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలోనే కెప్టెన్‌ కోహ్లీ తొలి టెస్టు పూర్తయ్యాక భారత్‌కు తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సతీమణి అనుష్కశర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుండటంతో విరాట్‌ పితృత్వపు సెలవులు తీసుకున్నాడు. 

‘కోహ్లీ ఆడకపోవడం విచారకరం. ఎవరైనా మేటి క్రికెటర్లతోనే ఆడాలనుకుంటారు. స్టీవ్‌స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌లతో పాటు అతడిని కూడా అత్యత్తమ క్రికెటర్‌గానే భావిస్తా. కోహ్లీ లేకపోవడం నిరుత్సాహపరిచే విషయమే అయినా భారత జట్టులో అనేక మంది సూపర్‌స్టార్లున్నారు. పుజారా, రహానెతో పాటు పలువురు యువ ప్రతిభావంతులు బరిలోకి దిగే అవకాశముంది. దాంతో మా ముందు పెద్ద సవాలే ఉంది. విరాట్‌ లేనంతమాత్రాన మేం కప్పును దక్కించుకున్నట్లు కాదు. చేయాల్సింది చాలా ఉంది’ అని లయన్‌ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని