విరుష్క అభిమానులకు శుభవార్త! 

టీమ్‌ఇండియా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురువారం శుభవార్త చెప్పాడు. తాను త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు వెల్లడించాడు...

Updated : 27 Aug 2020 12:13 IST

తల్లికాబోతున్న అనుష్క.. ఎప్పుడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురువారం శుభవార్త చెప్పాడు. తాను త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు వెల్లడించాడు. ట్విటర్‌ వేదికగా అనుష్కశర్మతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. జనవరిలో  తాము ముగ్గురం కాబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా, వీరిద్దరూ ఒక యాడ్‌ షూటింగ్‌లో పరిచయం కాగా, తర్వాత ప్రేమికులుగా మారారు. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2017 డిసెంబర్‌ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు.  

ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లీ ఆపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యాడు. కరోనా పరిస్థితుల వల్ల ఆ టోర్నీ రద్దవ్వడం, అనంతరం లాక్‌డౌన్‌ విధించడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో కోహ్లీ దంపతులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా కనిపించారు. ఆపత్కాలంలోనూ విరాళాలు సేకరించారు. అలాగే ఇటీవల వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి తమ వంతుగా సాయం చేశారు.

లాక్‌డౌన్‌ తర్వాత ఐపీఎల్‌పై స్పష్టత రావడంతో కోహ్లీ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. గతవారమే ఆర్సీబీ దుబాయ్‌కి చేరుకుంది. ఆటగాళ్లంతా ఇప్పుడక్కడ క్వారెంటైన్‌లో ఉన్నారు. కోహ్లీ కూడా గతవారం ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నాడు. క్వారెంటైన్‌ సమయంలోనూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ హోటల్‌ గదిలోనే శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు. నేటితో ఆ గడువు కూడా పూర్తికానుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో సాధన మొదలెడతాడు. ఈ నేపథ్యంలోనే గురువారం సామాజిక మాధ్యమాల్లో శుభవార్త చెప్పేశాడు. దీంతో అటు అభిమానుల నుంచీ, ఇటు తోటి క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు అనుష్క పోస్టుకు బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోయిన్లు కూడా కంగ్రాట్స్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని