ఐపీఎల్‌: బౌలర్‌కి ఐదు ఓవర్లు ఇవ్వాలి

ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ఓ కొత్త ప్రతిపాదనను బీసీసీఐ, ఐసీసీ..

Published : 10 Sep 2020 01:35 IST

ఐసీసీ, బీసీసీఐకి ప్రతిపాదించిన షేన్‌ వార్న్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ఓ కొత్త ప్రతిపాదనను బీసీసీఐ, ఐసీసీ ముందుంచాడు. టీ20ల్లో ఒక బౌలర్‌కి గరిష్ఠంగా ఐదు ఓవర్లు ఇవ్వాలంటూ కోరాడు. టీ20ల్లో ఈ సడలింపులు తీసుకువచ్చేముందే కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లోనే ఈ దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలంటూ కోరాడు. తన ప్రతిపాదనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీకి, ఐసీసీకి ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్టు చేశాడు. ‘టీ20ల్లో ఒక బౌలర్‌కి 5 ఓవర్ల నా అభిప్రాయాన్ని అనేక మంది సమర్థిస్తున్నారు. ఆ సడలింపులను సెప్టెంబర్‌ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్‌లోనే ప్రయోగిస్తే బాగుంటుంది’ అంటూ ఈ మాజీ స్పిన్నర్‌ పోస్టు చేశాడు. 

షేన్‌ వార్న్‌ పోస్టును సమర్థిస్తూ అనేక మంది కాంమెంట్లు చేశారు. క్రికెట్‌ నాణ్యతను పెంచేందుకు ఈ పనిని ఎప్పుడో చేసి ఉండాల్సిందిగా పేర్కొన్నారు. అయితే అలా చేస్తే ఆల్‌రౌండర్లకి అన్యాయం జరుగుతుందని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం టీ20ల్లో ఒక బౌలర్‌ గరిష్ఠంగా నాలుగు ఓవర్లు మాత్రమే వేయాలనే నిబంధన ఉంది. ఎక్కువ మందికి బౌలింగ్ అవకాశం కల్పించడం, మరికొన్ని కారణాలతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు