‘లగాన్’‌ మన్కడింగ్‌ను గుర్తుచేసిన జాఫర్

టీమ్‌ఇండియా క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ ఇటీవల ట్విటర్‌లో చెలరేగిపోతున్నాడు. నిత్యం ఎవర్నో ఒకర్నీ ట్రోల్‌ చేస్తూ సరదా మీమ్‌లతో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర పోస్టు చేశాడు...

Published : 22 Nov 2020 10:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ ఇటీవల ట్విటర్‌లో చెలరేగిపోతున్నాడు. నిత్యం ఎవర్నో ఒకర్నీ ట్రోల్‌ చేస్తూ సరదా మీమ్‌లతో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర పోస్టు చేశాడు. తొలుత ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ఓ ట్వీట్‌ చేస్తూ.. ఆటగాళ్లు, జట్ల పేర్లు చెప్పకుండా మీ ఫేవరెట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఏదని అడిగింది. దానికి స్పందించిన జాఫర్‌ అశ్విన్‌ను ట్యాగ్‌ చేసి ఓ మీమ్‌ను రీట్వీట్‌ చేశాడు. అందులో ఆమిర్‌‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్‌ సినిమా లగాన్‌లోని ఓ క్రికెట్‌ సన్నివేశాన్ని జత చేశాడు. ఆమిర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా అవతలి ఎండ్‌లో ఉండే ఓ కుర్రాడు క్రీజు వదిలి ముందుకు రావడంతో బౌలర్‌ మన్కడింగ్‌ చేసే సన్నివేశం అది. దీని ద్వారా గతేడాది ఐపీఎల్‌లో అశ్విన్‌ రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌బట్లర్‌ను ఇలాగే ఔట్‌ చేసిన మ్యాచ్‌ ఇష్టమని చెప్పకనే చెప్పాడు. 

ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రపంచ క్రికెట్‌ను రెండు వర్గాలుగా విభజించింది. కొందరు అశ్విన్‌ చర్యను తప్పుపట్టగా, మరికొందరు అతడు నియమాలకు కట్టుబడే ఆడాడని మద్దతు తెలిపారు. అయితే, ఈ ఏడాది దిల్లీ తరఫున ఆడిన అశ్విన్‌ ఓ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ఫించ్‌ను ఇలాగే ఔట్‌ చేసే అవకాశం ఉన్నా హెచ్చరించి వదిలేశాడు. ఇప్పుడు ఆ వివాదాస్పద అంశంపై వసీమ్‌ జోక్‌ చేయగా అశ్విన్‌ బదులిస్తూ సరదాగా నవ్వుకున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని