రోహిత్‌ శర్మను విమర్శిస్తే జాఫర్‌ ట్రోల్‌ చేశాడు..

మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్‌లో రోహిత్‌ శర్మను తుది జట్టులో ఎంపిక చేయడం సందేహమని మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ పేర్కొనడంతో టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌...

Published : 22 Nov 2020 01:35 IST


ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే 4 టెస్టుల సిరీస్‌లో రోహిత్‌ శర్మను తుది జట్టులో ఎంపిక చేయడం సందేహమని మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ పేర్కొనడంతో టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ స్పందించాడు. హాగ్‌ను ట్రోల్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. అసలేం జరిగిందంటే.. తాజాగా ఓ నెటిజన్‌ ఈ ఆస్ట్రేలియా స్పిన్నర్‌ను.. చివరి మూడు టెస్టుల్లో విరాట్‌ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో అజింక్య రహానె కెప్టెన్సీపై ఓ ప్రశ్న వేశాడు. దానికి స్పందించిన హాగ్‌.. రహానె అద్భుతంగా ఆడతాడని చెప్పాడు. అలాగే రోహిత్‌ను ఉద్దేశించి టెస్టు క్రికెట్‌లో అతడి రికార్డులు చూస్తే తుది జట్టులో అవకాశం లభించేలా లేదని విమర్శించాడు. 

ఈ ట్వీట్‌ను చూసిన జాఫర్‌.. ‘రా బేటా రా.. ఇక్కడికి రా’ అనే అర్థం వచ్చేలా ఒక సరదా మీమ్‌ను పోస్టుచేశాడు. అలాగే టీమ్‌ఇండియాలో రోహిత్‌కు అవకాశం ఉండదా అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేశాడు. ఇదిలా ఉండగా, తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన 3 ఫార్మాట్ల జట్లలో రోహిత్‌ పేరు లేకపోవడం తెలిసిన విషయమే. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో బీసీసీఐ మళ్లీ అతడిని టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే ముంబయి ఇండియన్స్‌ ఐదోసారి టీ20 లీగ్‌ గెలిచాక హిట్‌మ్యాన్‌ బెంగళూరుకు చేరుకున్నాడు. ప్రస్తుతం అక్కడి జాతీయ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మరో వారంలో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఆడకపోయినా 4 టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని