జడేజా.. నిన్ను సూపర్‌ అనేది ఇందుకే!

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టులో ఎంత ముఖ్యమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి సెషన్‌లో ఓ అద్భుత క్యాచ్‌ అందుకొని...

Published : 27 Dec 2020 01:16 IST

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టులో ఎంత ముఖ్యమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి సెషన్‌లో ఓ అద్భుత క్యాచ్‌ అందుకొని అభిమానుల మన్ననలు పొందాడు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 10 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్‌ జో బర్న్స్‌(0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. 

ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 35 పరుగుల వద్ద మరో ఓపెనర్‌ మాథ్యూవేడ్‌(30; 39 బంతుల్లో 3x4) ఔటయ్యాడు. అశ్విన్‌ వేసిన 12.5 ఓవర్‌కు అతడు షాట్‌ ఆడడంతో బంతి గాల్లోకి లేచింది. వెంటనే స్పందించిన జడేజా ఆ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అదే సమయంలో శుభ్‌మన్‌ గిల్‌ సైతం క్యాచ్‌ పట్టడానికి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు ఢీకొట్టుకున్నప్పటికీ.. అప్పటికే జడ్డూ ఆ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో కంగారూల జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. గిల్‌ పరుగెత్తుకు వచ్చి బలంగా తాకినా ఈ మేటి ఆల్‌రౌండర్‌ బంతిని వదలకుండా అలాగే పట్టుకున్నాడు. ఈ వీడియోను ఓ ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పంచుకోవడంతో అది చూసిన అభిమానులు జడ్డూను ప్రశంసిస్తున్నారు.

ఇవీ చదవండి..
స్టీవ్‌స్మిత్‌ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి
కాంస్యమే.. కొండంత బలాన్నిచ్చింది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని