సచిన్‌ జల విన్యాసాలు చూశారా?

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రస్తుతం సరదాగా వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ అద్భుతమైన వీడియో పంచుకున్నాడు...

Updated : 08 Dec 2020 09:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రస్తుతం వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ అద్భుతమైన వీడియో పంచుకున్నాడు. ఎక్కడికి వెళ్లాడో వివరాలు తెలియకుండా జాగ్రత్తపడిన లిటిల్‌మాస్టర్‌ పారా సెయిలింగ్‌ చేస్తూ గాల్లో విహరించాడు. దానికి ‘హమ్‌తో ఉడ్‌ గయే’ అనే బాలీవుడ్‌ పాటను జత చేశాడు. కరోనా పరిస్థితుల కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచీ ఇంటికే పరిమితమైన సచిన్‌ ఇటీవలే బయటకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన క్రికెట్‌ స్నేహితులతో కలిసి గోల్ఫ్‌ ఆడుతున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తరచూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు పంచుకొని అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పారా సెయిలింగ్‌ వీడియోను పంచుకున్నాడు. 

సచిన్‌ 1989లో 16 ఏళ్ల వయసులోనే పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాలపై మోసి ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటాడు. ‌ఈ క్రమంలోనే 2011లో తన చిరకాల కోరికగా మిగిలిపోయిన వన్డే ప్రపంచకప్‌ను సాధించి 2013లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.

ఇవీ చదవండి..

ధోనీని నేనూ మిస్‌ అవుతున్నా: కోహ్లీ

ఒక్క కిడ్నీతో ఒలింపిక్స్‌ వరకూ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని