ధోనీ లాగే సాహా చేశాడు..

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా శనివారం జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మాథ్యూవేడ్‌(33; 53 బంతుల్లో 5x4)ను రనౌట్‌ చేసి మాజీ సారథి...

Published : 20 Dec 2020 14:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా శనివారం జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మాథ్యూవేడ్‌(33; 53 బంతుల్లో 5x4)ను రనౌట్‌ చేసి మాజీ సారథి, కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీని గుర్తు చేశాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 36/9కే కుప్పకూలగా ఆసీస్‌ ఓపెనర్లు ఛేదనకు దిగారు. జోబర్న్స్‌ (51 నాటౌట్‌; 63 బంతుల్లో 7x4, 1x6)తో కలిసి వేడ్ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే అశ్విన్‌ వేసిన 18వ ఓవర్‌ రెండో బంతికి ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి వేడ్‌ ఔటయ్యాడు. బంతి అతడి బ్యాట్‌కు తగిలి సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పృథ్వీషా కాళ్లకు తాకింది. అది చూసుకోకుండా ముందుకు వెళ్లిన మాథ్యూవేడ్‌ను సాహా ఔట్‌ చేశాడు. బంతి అక్కడే ఉండడంతో వెంటనే అందుకొని వెనక్కి తిరిగే బంతిని వికెట్లపైకి విసిరాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెనర్‌ రనౌటయ్యాడు. ఇది అచ్చం ధోనీ చేసే రనౌట్‌లా ఉంది. ఆ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్‌ వార్తల వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో లబుషేన్‌(6) సైతం నిరాశపరిచాడు. చివరికి స్మిత్‌(1)తో కలిసి బర్న్స్‌ మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చాడు. మీరూ ఒకసారి ఆ రనౌట్‌ చూడండి.
ఇవీ చదవండి..
ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి ఇతరులను పట్టించుకోకండి..
దాదా రక్షించు.. శాస్త్రీ దిగిపో!
నిద్రమత్తులో టీమిండియా స్కోర్‌ 369 అనుకున్నా..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని