ఫిలిప్‌ హ్యూస్‌ ఫొటో కనిపించగానే..

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్, ఫిలిప్‌ హ్యూస్‌లకు మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా క్రికెటర్లు నివాళులర్పించారు. మైదానంలో ఇరుజట్ల ఆటగాళ్లు నిలబడి మౌనం పాటించారు...

Updated : 28 Nov 2020 11:19 IST

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్, ఫిలిప్‌ హ్యూస్‌లకు మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా క్రికెటర్లు నివాళులర్పించారు. మైదానంలో ఇరుజట్ల ఆటగాళ్లు నిలబడి మౌనం పాటించారు. చేతికి నల్లబ్యాండ్లు ధరించి మ్యాచ్‌ ఆడారు. 2014లో షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీ మ్యాచ్‌లో అబాట్‌ వేసిన బౌన్సర్‌ ఎడమ చెవి కింద తాకడంతో క్రీజులో కుప్పకూలి కోమాలోకి వెళ్లిన ఫిలిప్‌.. రెండు రోజుల తర్వాత మరణించిన సంగతి తెలిసిందే. అతను మరణించి శుక్రవారానికి (నవంబర్‌ 27) సరిగ్గా ఆరేళ్లు. ఇదే సిడ్నీ క్రికెట్‌ మైదానంలో గాయపడి తుదిశ్వాస విడిచిన అతణ్ని.. తిరిగి ఇదే రోజున ఆరో వర్థంతి సందర్భంగా ఆటగాళ్లు తలుచుకున్నారు. మ్యాచ్‌ సమయంలో మైదానంలోని తెరపై అతని ఫోటోలు ప్రదర్శించడంతో ఆసీస్‌ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు జోన్స్‌.. భారత్‌లో ఐపీఎల్‌ వ్యాఖ్యానం కోసం వచ్చి ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న ముంబయిలో గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని