టీమ్‌ఇండియా ఇలా ఎందుకు చేసింది?

ఆస్ట్రేలియా ఎ జట్టుతో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పింక్‌బాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అనుహ్య నిర్ణయాలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌ లాంటి...

Updated : 11 Dec 2020 12:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఎ జట్టుతో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పింక్‌బాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అనుహ్య నిర్ణయాలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌ లాంటి ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు విశ్రాంతినిచ్చింది. మరోవైపు తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేని స్పిన్నర్లను కూడా ఈ మ్యాచ్‌లో పూర్తిగా పక్కనపెట్టింది. టీమ్‌ఇండియా 2019 నవంబర్‌లో కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా తొలిసారి బంగ్లాదేశ్‌తో పింక్‌బాల్‌ టెస్టు ఆడింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడింది.

ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌ కోల్పోయిన కోహ్లీ సేన.. అనంతరం టీ20 సిరీస్‌ గెలుపొందింది. ఇప్పుడు కీలకమైన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 17 నుంచి అడిలైడ్‌లో ప్రారంభమయ్యే తొలి డే/నైట్‌ టెస్టుకు ముందు ఇరు జట్లకు పింక్‌బాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియాలో డే/నైట్‌ టెస్టు గెలవడం అంత సులువు కాదు. దానికి సరైన ప్రణాళిక అవసరం. కానీ టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లను పక్కనపెట్టింది. దీంతో తొలి టెస్టులో ఆయా ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచిచూడాలి. 

ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రహానె టీమ్‌ 23 ఓవర్లకు 102/4తో నిలిచింది. ఆదిలోనే మయాంక్‌(2) ఔటైనా పృథ్వీషా(40), శుభ్‌మన్‌గిల్‌(43) ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. నిలకడగా ఆడుతున్న వీరిని విల్‌ సుదర్‌లాండ్‌ విడదీశాడు. జట్టు స్కోర్‌ 72 పరుగుల వద్ద పృథ్వి ఔటవ్వగా కాసేపటికే హనుమ విహారి(15), శుభ్‌మన్‌ వరుస ఓవర్లలో వెనుదిరిగారు. ప్రస్తుతం రహానె, రిషభ్‌పంత్‌ బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి..

మూడేళ్లుగా.. ఇంకా జీవితాంతం..

 సచిన్.. సారా.. సముద్రంలో‌ జోక్‌..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని