Boxing: ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ వాయిదా

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 4న టర్కీలో ఈ మెగా టోర్నీ ఆరంభం కావాలి. అయితే ఆ దేశంలో కరోనా ప్రభావం ఎక్కువ

Updated : 11 Nov 2021 10:03 IST

దిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 4న టర్కీలో ఈ మెగా టోర్నీ ఆరంభం కావాలి. అయితే ఆ దేశంలో కరోనా ప్రభావం ఎక్కువ ఉండటంతో ఛాంపియన్‌షిప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం ప్రకటించింది. టర్కీలో రోజు 25 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సరు అన్ని విభాగాల్లో పోటీపడుతున్నారు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతలకు నేరుగా ఈ టోర్నీకి పంపారు. అయితే ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్‌ (70 కిలోలు) జాతీయ బాక్సింగ్‌లో పోటీపడకపోయినా ఆమెకు అర్హత కల్పించారు. భారత బాక్సింగ్‌ సమాఖ్య తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆ విభాగంలో జాతీయ ఛాంప్‌ అరుంధతి చౌదరి దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని