కాబోయే సతీమణితో చాహల్‌ అదిరిపోయే వీడియో..

టీమ్‌ఇండియా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ గురువారం ఓ అదిరిపోయే వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తనకు కాబోయే సతీమణి ధనశ్రీతో కలిసి...

Updated : 20 Sep 2022 15:59 IST

నీ ఇన్‌స్టాగ్రామ్‌ రిపోర్ట్‌ చేస్తా.. క్రిస్‌గేల్‌ వార్నింగ్‌

(ఫొటో: చాహల్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ గురువారం ఓ అదిరిపోయే వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తనకు కాబోయే సతీమణి ధనశ్రీతో కలిసి ఓ పాటను అనుకరించిన అతడు దాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. కాబోయే దంపతులిద్దరూ అందులో అదరగొట్టారు. తమ నటనతో ఆ పాటకు తగ్గ హావభావాలు పలికించి నెటిజన్లను ఫిదా చేశారు. ఆ వీడియో చూసిన విండీస్‌ బ్యాట్స్‌మన్‌, యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ మరోసారి ఆర్సీబీ స్పిన్నర్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. ‘చాహల్‌ ఇప్పటికే చాలా చేశావు. నేనిప్పుడు నీ ఇన్‌స్టాగ్రామ్‌ను రిపోర్ట్‌ చేస్తున్నా’ నంటూ హెచ్చరించాడు. అయితే, ఇలా సరదాకే కామెంట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గేల్‌ ఆ కామెంట్‌లో నవ్వుతున్న ఎమోజీలు జతచేశాడు. 
 అంతకుముందు లాక్‌డౌన్‌ సమయంలోనూ ఈ విధ్వంసక వీరుడు చాహల్‌ను ఇలాగే హెచ్చరించాడు. అప్పుడు టీమ్‌ఇండియా స్పిన్నర్‌ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. నిత్యం ఏదో ఒక వీడయోతో అలరించేవాడు. టిక్‌టాక్‌లో తన ఫన్నీ వీడియోలతో బాగా ప్రాచుర్యం పొందాడు. అలాగే ఏ క్రికెటర్‌ అయినా ఆన్‌లైన్‌లో కనిపిస్తే చాలు చటుక్కున వాళ్ల మధ్య దూరిపోయి సరదా జోక్‌లతో కవ్వించేవాడు. ఈ క్రమంలోనే అతడి వీడియోలు చూసి క్రిస్‌గేల్‌, రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి ఆటగాళ్లు అతడిపై కామెంట్లు చేశారు. ఇక లాక్‌డౌన్‌ అనంతరం ధనశ్రీతో నిశ్చితార్ధం చేసుకున్న యుజీ.. ఆ ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని. అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఆపై ఐపీఎల్‌ ఆడేందుకు ఆర్సీబీతో కలిసి దుబాయ్‌కు వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్‌ చేస్తూ మెగా ఈవెంట్‌ కోసం సన్నద్ధమౌతున్నాడు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తనకు కాబోయే భాగస్వామితో దిగిన ఫొటోలనునెటిజన్లను అలరిస్తున్నాడు. ఇక గురువారం ఏకంగా ఒక వీడియోను విడుదల చేసి అందరినీ మైమరపించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని