neeraj chopra: నీరజ్‌ చోప్రా గర్భా డ్యాన్స్‌ చూశారా?

గర్భా వేడుకల్లో నీరజ్‌ చోప్రా అభిమానులతో కలిసి డ్యాన్స్‌ చేశాడు.

Published : 30 Sep 2022 01:08 IST

వడోదరా: సినీ తారలకు ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులేస్తూ ఇటీవల క్రికెటర్లు చేసిన సందడి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా..’ పాటకు డ్యాన్స్‌ చేసిన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అభిమానులను హుషారెత్తించాడు. తాజాగా ఈ జాబితాలో ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా చేరాడు. 

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌లోని వడోదరాలో నిర్వహించిన గర్భా వేడుకల్లో నీరజ్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఈ ఆటగాడిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు నీరజ్‌ విజయాలను గుర్తు చేస్తూ ‘భారత్‌.. భారత్‌’ అంటూ నినాదాలు చేసి ఉత్సాహపరిచారు. నెట్టింట ఈ వీడియో వైరల్‌గా మారింది.  ఈ యువ ఆటగాడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం సాధించిపెట్టిన విషయం తెలిసిందే.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని