Test Captain : భావి భారత టెస్టు కెప్టెన్‌గా అతడికే ఎక్కువ అవకాశం: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు

ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు సారథిగా రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే ఇప్పటికే రోహిత్ వయస్సు 35 ఏళ్లు. మహా అయితే మూడు ఫార్మాట్లలో...

Published : 17 Aug 2022 01:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు సారథిగా రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే ఇప్పటికే రోహిత్ వయస్సు 35 ఏళ్లు. మహా అయితే మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియాకు మరో మూడేళ్లు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత అయినా సారథ్య బాధ్యతలను వేరొకరికి అప్పగించాలి. ఈ క్రమంలో ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ తర్వాత నాయకుడిగా బాధ్యతలు స్వీకరిస్తాడా..? లేకపోతే తెల్లబంతి ఫార్మాట్లు (వన్డేలు, టీ20లు), ఎర్రబంతి క్రికెట్‌ (టెస్టులు)కు వేర్వేరు కెప్టెన్లను నియమిస్తారా..? అనే చర్చకు టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా తెరలేపాడు.  ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్‌ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ కంటే రిషభ్‌ పంత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చోప్రా అభిప్రాయపడ్డాడు.

‘‘రోహిత్ తర్వాత ఎవరు కెప్టెన్‌గా టెస్టు జట్టు బాధ్యతలు స్వీకరిస్తారు..? దీనికి నేను ముగ్గురు సారథులు ఉన్నారని చెబుతా. కేఎల్ రాహుల్‌, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్ గురించి మాట్లాడుకుందాం. సంజూ శాంసన్‌ కూడా ఉన్నప్పటికీ జట్టులో సుస్థిర స్థానం లేదు. ఉదాహరణకు రిషభ్‌ పంత్‌ను తీసుకుంటే.. అతడు కొన్నిసార్లు కెప్టెన్‌గా చాలా దూకుడుగా వ్యవహరిస్తాడు. ఎందుకోగానీ మరికొన్నిసార్లు బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. ఇంకా నేర్చుకునే క్రమంలోనే ఉన్నాడు. ఈ విషయంలో కేఎల్ రాహుల్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అందుకే రాహుల్‌ కంటే రిషభ్‌ కాస్త పైన నిలిచాడు. రాహుల్‌ క్లాస్‌ ప్లేయర్‌ కాగా.. రిషభ్‌ ఎంత దూకుడుగా ఆడతాడో తెలిసిందే’’ అని ఆకాశ్ వివరించాడు. వీరిద్దరి కెప్టెన్సీ శైలితో శ్రేయస్, సంజూ శాంసన్‌ సారథ్య తీరును చోప్రా విశ్లేషించాడు. ఇద్దరూ ఫ్రాంచైజీ క్రికెట్‌లో కెప్టెన్లుగా వ్యవహరించారని చెప్పాడు. వీరిలో బౌలర్లను వినియోగించుకునే పద్ధతిలో సంజూ శాంసన్‌ కాస్త బెటర్‌గా అనిపిస్తాడని ఆకాశ్‌ చోప్రా వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని