Team India: ఇలా అయితే ఆసియా కప్‌ తప్పిదమే.. పునరావృతమవుతుంది: ఆకాశ్‌ చోప్రా

వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌నకు జస్ప్రీత్‌ బుమ్రా దూరం కావడం టీమ్‌ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ. మెగా టోర్నీలో బౌలింగ్‌ దళాన్ని నడిపిస్తాడని భావించిన బుమ్రా.. కీలక సమయంలో జట్టుకు దూరం కావడంపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Published : 05 Oct 2022 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌నకు జస్ప్రీత్‌ బుమ్రా దూరం కావడం టీమ్‌ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ. మెగా టోర్నీలో బౌలింగ్‌ దళాన్ని నడిపిస్తాడని భావించిన బుమ్రా.. కీలక సమయంలో జట్టుకు దూరం కావడంపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా ఇదే విషయంపై ట్విటర్‌లో స్పందించాడు. బుమ్రా గాయంపై మేనేజ్‌మెంట్‌ ప్రణాళికలు ఏంటో అర్థం కాలేదని పేర్కొన్నాడు. అలాగే ఆసియా కప్‌లో మాదిరిగా టీ20 ప్రపంచకప్‌లోనూ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్‌లో కూడా బౌలింగ్‌ వైఫల్యంతో కీలక మ్యాచ్‌లను టీమ్‌ఇండియా చేజార్చుకొంది. 

‘‘గాయం కారణంగా బుమ్రా విండీస్‌తో సిరీస్‌.. ఆసియా కప్‌ నుంచి వైదొలిగాడు. బుమ్రాకు బదులు షమీ అయితేనే ఉత్తమ ఎంపిక అయ్యేది. కానీ భారత్‌ కేవలం ముగ్గురు పేసర్లతోనే ఆసియా కప్‌ టోర్నీకి వెళ్లింది. భారీ మూల్యం చెల్లించుకొంది. ఇప్పుడు కూడా ఇలానే చేస్తే మళ్లీ అదే పునరావృతం అయ్యే అవకాశం ఉంది’’ అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్ చేశాడు. బుమ్రా వైదొలగిన అనంతరం దక్షిణాఫ్రికాతో మిగతా మ్యాచ్‌లకు సిరాజ్‌ను ఎంపిక చేయడం గమనార్హం. టీ20 మెగా టోర్నీ ప్రధాన జట్టులోకి మహమ్మద్‌ సిరాజ్‌ను తీసుకొంటే.. సిరాజ్‌ను స్టాండ్‌బై ఆటగాడిగా తీసుకొనే వెసులుబాటు ఉంటుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts