WTC Final: పుజారాకు 2.. బుమ్రా 3 మార్కులే

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసింది. టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. అయితే మ్యాచులో ఆడిన విధానాన్ని బట్టి మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆటగాళ్లకు రేటింగ్‌ ఇచ్చాడు. కీలకమైన వికెట్లు తీసిన మహ్మద్‌ షమికి 7 మార్కులిచ్చాడు. కెప్టెన్‌ కోహ్లీ, డిప్యూటీ కెప్టెన్‌ అజింక్య రహానెకు 5 మార్కులు..

Published : 25 Jun 2021 17:38 IST

ఆకాశ్ చోప్రా విశ్లేషణ

ముంబయి: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసింది. టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. అయితే మ్యాచులో ఆడిన విధానాన్ని బట్టి మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆటగాళ్లకు రేటింగ్‌ ఇచ్చాడు. కీలకమైన వికెట్లు తీసిన మహ్మద్‌ షమికి 7 మార్కులిచ్చాడు. కెప్టెన్‌ కోహ్లీ, డిప్యూటీ కెప్టెన్‌ అజింక్య రహానెకు 5 మార్కులు వేశాడు. అత్యల్పంగా చెతేశ్వర్‌ పుజారాకు 2 మార్కులే ఇవ్వడం గమనార్హం.

‘ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు పదింటికి 6 మార్కులు వేస్తాను. రెండు ఇన్నింగ్సుల్లోనూ అతడు శుభారంభాలు ఇచ్చాడు. సగం నిండిన గ్లాసునే నేను చూస్తాను. ఎందుకంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కొత్త బంతిని ఎదుర్కోవడం కష్టం. తొలి ఇన్నింగ్స్‌లో అతడికి శుభ్‌మన్‌ గిల్‌ అండగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం త్వరగా ఔటయ్యాడు. అందుకే 4 మార్కులే’ అని ఆకాశ్ అన్నాడు.

‘చెతేశ్వర్‌ పుజారా నుంచి ఎక్కువే ఆశిస్తాం. అతడు రెండు ఇన్నింగ్సుల్లోనూ విఫలమయ్యాడు. అందుకే 10కి 2 మార్కులే ఇస్తాను. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, డిప్యూటీ కెప్టెన్‌ అజింక్య రహానె తొలి ఇన్నింగ్సులో రాణించారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోలేదు. అందుకే 5 మార్కులు ఇస్తున్నాను. పంత్‌ ఫర్వాలేదనిపించాడు. అతడికి 5 మార్కులు వేస్తాను. అయితే అతడు ఔటైన తీరు మాత్రం ఆశ్చర్యపరిచేదే’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్‌ అశ్విన్‌కు 6 మార్కులు వేసిన ఆకాశ్‌.. జడ్డూకు 3 మాత్రమే వేశాడు. పేస్‌ ద్వయం మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మకు ఎక్కువ రేటింగే ఇచ్చాడు. షమికి 7, ఇసాంత్‌కు 6 మార్కులు వేశాడు. వికెట్లు తీయలేకపోయిన బుమ్రాకు 3 మార్కులే వేశాడు.

ఎవరికి ఎన్నంటే..

రోహిత్‌ శర్మ (6/10)

శుభ్‌మన్‌ గిల్‌ (4/10)

చెతేశ్వర్‌ పుజారా (2/10)

విరాట్‌ కోహ్లీ (5/10)

అజింక్య రహానె (5/10)

రిషభ్‌ పంత్‌ (5/10)

రవీంద్ర జడేజా (3/10)

రవిచంద్రన్‌ అశ్విన్‌ (6/10)

ఇషాంత్‌ శర్మ (6/10)

మహ్మద్‌ షమి (7/10)

జస్ప్రీత్‌ బుమ్రా (3/10)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని