Virat - ABD: తొలినాళ్లలో విరాట్‌ను అలా అనుకున్నా: ఏబీ డివిలియర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్రత్యేకమైంది. ఇప్పటి వరకు ఒక్క కప్ గెలవకపోయినా.. ప్రతిసారి స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది. విరాట్ కోహ్లీతో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ కలిసి ఆడారు. నాటి ముచ్చట్లను మరోసారి గుర్తు చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కెరీర్ ఆరంభంలో ఇప్పటి కన్నా దూకుడుగా ఉండేవాడు. అంతర్జాతీయ మ్యాచ్ అయినా.. దేశీయ లీగ్‌లోనైనా ఇలాగే ఉండేవాడు. అప్పట్లో విరాట్ కోహ్లీకి అహంకారం ఎక్కువనే విమర్శలూ వచ్చాయి. తాను కూడా ఇలానే విరాట్ గురించి అనుకున్నానని ఐపీఎల్‌లో ఒకప్పటి సహచరుడు ఏబీ డివిలియర్స్ గుర్తు చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో జరిగిన చర్చా కార్యక్రమంలో ఏబీడీ మాట్లాడాడు. విరాట్ గురించి తొలి నాళ్లలో ఏమనుకున్నావు అని గేల్ అడిగిన ప్రశ్నకు ఏబీడీ సమాధానం ఇచ్చాడు. వీరిద్దరూ విరాట్ కోహ్లీతో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఆడిన విషయం తెలిసిందే.
‘‘నేను ఇప్పటికే చాలాసార్లు సమాధానం ఇచ్చా. విరాట్‌ను తొలిసారి కలిసినప్పుడు అహంకారిగా భావించా. అతడి హెయిర్‌స్టైల్, ఆడంబరంగా ఉన్న విధానం చూసిన తర్వాత నేను అలా అనుకున్నా. అయితే, కోహ్లీ ఆత్మవిశ్వాసం స్థాయి మాత్రం అదుర్స్. అతడి ఆటను చూశాక నా అభిప్రాయం మారింది. అయితే, విరాట్ మానవత్వాన్ని దగ్గర నుంచి గమనించాక గౌరవం పెరిగింది. నేను తొలిసారి కోహ్లీని కలిసినప్పుడు అతడి చుట్టూ ఏవో అడ్డంకులు ఉన్నాయనిపించింది. అతడు ఆకాశం నుంచి భూమి మీదకు దిగాల్సిన అవసరం ఉందని అనుకున్నా. తొలినాళ్లలో అతడి వ్యవహార శైలిని ఇష్టపడలేదు కానీ.. ఇప్పుడు అతడు అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన ఆటగాడు’’ అని డివిలియర్స్ తెలిపాడు.
ఎలాంటి డ్యాన్స్ అయినా నాదే విజయం: గేల్
విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మించిన క్రిస్ గేల్ కూడా తన డ్రెస్సింగ్ రూమ్ అనుభవాలను చెప్పాడు. ‘‘విరాట్ కోహ్లీ, ఇతర సభ్యులతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం బాగుంది. ఎప్పుడూ సరదాగా ఉండేవాళ్లం. డ్యాన్స్ చేస్తూ సంతోషంగా గడిపేశాం. విరాట్ కోహ్లీలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉంది. అతడూ తన డ్యాన్స్ చేసేవాడు. అయితే, ఇండియన్ డ్యాన్స్ అయినా కరేబియన్ డ్యాన్స్ అయినా క్రిస్ గేల్‌దే విజయం (నవ్వుతూ)’’ అని గేల్ గుర్తు చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్.. అలా ఛాన్స్ దక్కించుకున్న వినాయక్
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి