Hardik: హార్దిక్‌పై వ్యాఖ్యలు వివాదాస్పదం.. నా ఉద్దేశం అది కాదు: అబ్దుల్ రజాక్
భారత స్టార్ బ్యాటర్ హార్ధిక్ పాండ్య (Hardik Pandya)పై మూడేళ్ల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్(Abdul Razzaq) తాజాగా స్పందించాడు. తన వ్యాఖ్యలను క్రికెట్ అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని వాటి ఉద్దేశం అది కాదన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ హార్ధిక్ పాండ్య (Hardik Pandya)పై మూడేళ్ల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్(Abdul Razzaq) తాజాగా స్పందించాడు. గతంలో ‘ఆల్‌రౌండర్‌గా హార్ధిక్ పాండ్య క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev)కు దరిదాపుల్లో కూడా లేడు’ అని ఓ ఇంటర్వ్యూలో రజాక్ వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో అతడి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో రజాక్ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నాడు. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తన వ్యాఖ్యలను క్రికెట్ అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని వాటి ఉద్దేశం అది కాదన్నాడు.
‘‘గతంలో హార్దిక్ పాండ్యపై నేను చేసిన వ్యాఖ్యలను అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా ఉద్దేశం అది కాదు. పాండ్య తన ఆటతీరును మెరుగుపరుచుకోవాలని ఓ క్రికెటర్‌గా చెప్పా. అతడు బ్యాటింగ్‌లో మెరుగుపడాలి. బౌలింగ్ చేసే ముందు ఒక డెలివరీని అంచనా వేయాలి. ఇదే విషయాన్ని గతంలో చెప్పాను. ఇది అర్థం చేసుకోకుండా నాపై విమర్శలు గుప్పించారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లపై నేను కామెంట్లు చేయను. ఒకవేళ కపిల్‌దేవ్ నాకు ఏవైనా సూచనలు ఇస్తే వాటిని నేను స్వీకరిస్తాను’’ అని పేర్కొన్నాడు. రజాక్ గతంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను బేబీ బౌలర్ అని వ్యాఖ్యానిస్తూ అతడు షాహీన్ అఫ్రిదికి దరిదాపుల్లో లేడని విమర్శించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భయానకం.. 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు..!
-
General News
Employee: ఆఫీసులో రోజుకి 6 గంటలు టాయిలెట్లోనే.. చివరకు ఇదీ జరిగింది!
-
India News
Wrestlers Protest: కోరిక తీరిస్తే.. ఖర్చు భరిస్తానన్నాడు: బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్లో కీలక ఆరోపణలు
-
Sports News
Ravi Shastri: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు నా ఎంపిక ఇలా..: రవిశాస్త్రి
-
General News
CM KCR: ఉద్యమానికి నాయకత్వం.. నా జీవితం ధన్యమైంది: కేసీఆర్
-
World News
US Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా దేవ్‌షా..!