ZIM vs IND: సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ.. జింబాబ్వే లక్ష్యం 235

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

Updated : 07 Jul 2024 18:16 IST

హరారె: జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమై పరాభవం ఎదుర్కొన్న టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం బ్యాట్‌తో సత్తాచాటింది. హరారె వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) తన రెండో అంతర్జాతీయ టీ20లోనే సెంచరీ బాదాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (77*; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకంతో మెరిశాడు. ఆఖర్లో రింకు సింగ్ (48*; 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ (2) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. 

సెంచరీ హీరో అభిషేక్ శర్మ తొలుత నెమ్మదిగా ఆడాడు. ఒక దశలో 30 బంతుల్లో 41 పరుగులతో ఉన్న అతడు తర్వాత గేర్లు మార్చి ఆడాడు. డియోన్ మేయర్స్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4, 6, 4 బాదేశాడు. రజా వేసిన 13 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు రాబట్టాడు అభిషేక్. మసకద్జ వేసిన తర్వాతి ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, తర్వాతి బంతికే మేయర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 38 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న రుతురాజ్.. తర్వాత దూకుడు పెంచాడు. చటార బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4, 4 రాబట్టాడు. రింకు సింగ్ కూడా తనదైన శైలిలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది. భారత్‌ చివరి 10 ఓవర్లలో 160 పరగులు రాబట్టడం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని