Rohit Sharma: సరైన సమయానికి రోహిత్ సెంచరీ: యువరాజ్ సింగ్
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ శుభ్‌మన్‌గిల్ ఇద్దరూ సెంచరీలు బాదారు. వారిపై భారత మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (101) సెంచరీ బాదాడు. దీంతో వన్డేల్లో తన 30వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. దీనిపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. రోహిత్‌ను ఉద్దేశించి సరైన సమయానికి సెంచరీ సాధించావు అంటూ ట్వీట్ చేశాడు. కివీస్‌తో వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో ద్విశతకం బాదిన శుభ్‌మన్‌గిల్ మూడో వన్డేలోనూ సెంచరీ సాధించాడు. అతడిని కూడా యువీ ప్రశంసించాడు.
దాదాపు మూడేళ్ల తర్వాత రోహిత్ వన్డేల్లో శతకం సాధించడం విశేషం. దీంతో అతడు వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ సరసన చేరాడు. వన్డేల్లో అర్ధ శతకాలతో రాణించినప్పటికీ రోహిత్ సెంచరీ చేయలేకపోవడం పట్ల పలువురు క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సైతం రోహిత్ సెంచరీ చేస్తే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో భారీ స్కోరు సాధించడం కంటే నిలకడగా రాణించడంపైనే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నానని రోహిత్ వెల్లడించాడు. అతడికి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మద్ధతుగా నిలిచాడు. రోహిత్ మంచిగానే బ్యాటింగ్ చేస్తున్నాడని అతడు భారీ స్కోర్ సాధించలేక పోవడం పెద్ద సమస్య కాదని పఠాన్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vijay Sethupathi: నేను కేవలం నటుడిని మాత్రమే... విజయ్ సేతుపతి అసహనం
-
World News
Diabetes: ‘డి’ విటమిన్‌తో మధుమేహం నుంచి రక్షణ!
-
Technology News
Whatsapp: వాట్సప్.. ఇక చిటికెలో ఫాంట్‌ను మార్చుకోవచ్చు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్
-
Ap-top-news News
AP Constable Exam: అభ్యర్థుల గోడు వినండి.. మొదటి కీలో ఒకలా.. తుది కీలో మరోలా!