CWG 2022: టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం.. మొత్తంగా ఎన్నంటే?

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆచంట శరత్‌ కమల్‌-శ్రీజ ఆకుల జోడీ సత్తా చాటింది. ఫైనల్‌లో 3-1తో..

Published : 08 Aug 2022 02:05 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆచంట శరత్‌ కమల్‌-శ్రీజ ఆకుల జోడీ సత్తా చాటింది. ఫైనల్‌లో 3-1తో మలేషియాకు చెందిన జావెన్‌-కరెన్‌ లైన్‌ను ఓడించి స్వర్ణం సాధించారు. మరోవైపు బాక్సింగ్‌ హెవీ వెయిట్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడిపై ఓడి సాగర్‌ అహ్లావత్ రజతం కైవసం చేసుకున్నాడు.  బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్.. జియాహెంగ్‌ (సింగపూర్‌)పై 21-15, 21-18 వరుస సెట్లలో గెలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. అలాగే బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌లో ఆస్ట్రేలియా జోడీపై గెలిచి ట్రీసా-గాయత్రి గోపీచంద్‌ ద్వయం కాంస్యం నెగ్గారు. తాజా పతకాలతో కలిపి ప్రస్తుత కామన్వెల్త్‌లో భారత్‌ 18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని