Adani Group: పారిస్‌ ఒలింపిక్స్‌ టీమ్‌ ఇండియా స్పాన్సర్‌గా అదానీ గ్రూప్‌..!

అదానీ గ్రూప్‌ ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ ప్రకటించారు. 

Published : 10 Jul 2024 13:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో పాల్గొనే భారత ఆటగాళ్ల బృందానికి ప్రధాన స్పాన్సర్‌గా కార్పొరేట్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహరిస్తుందని సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ బుధవారం ప్రకటించారు. ఆటగాళ్లకు తమ మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో #DeshkaGeetAtOlympics పేరిట వారికి మద్దతుగా ప్రచారం ప్రారంభించినట్లు వెల్లడించారు. దీంతోపాటు 1.45 నిమిషాల నిడివి గల ఓ వీడియోను కూడా సిద్ధం చేసింది. ఇందులో భారత్‌కు చెందిన ప్రతిభావంతులైన అథ్లెట్లు శ్రమిస్తున్న దృశ్యాలున్నాయి. 

ఈనెల 26 నుంచే పారిస్‌ వేదికగా అంగరంగ వైభవంగా ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఎప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా వీటికి సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈసారి ఒలింపిక్స్‌లో పోటీపడే అథ్లెట్ల సంఖ్య తగ్గింది. షెడ్యూల్‌ ప్రకారం 2020లో కాకుండా కొవిడ్‌ కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతానికి పారిస్‌లో పోటీపడబోతున్న అథ్లెట్ల సంఖ్య 113 మంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని