IND Vs PAK : దాయాది జట్ల మధ్య పోరు.. ఈ ఆసక్తికర ఘటనలు చూశారా..?

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఇరు జట్ల అభిమానులు ఓ యుద్ధంలా భావిస్తారు. స్టేడియంలో, టీవీల ముందు మ్యాచ్‌ను అలాగే వీక్షిస్తారు.

Updated : 30 Aug 2022 12:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌ను ఇరు జట్ల అభిమానులూ ఆస్వాదించారు. చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో.. హార్దిక్‌ పాండ్యా సిక్స్‌ కొట్టి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో.. ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానుల మధ్య కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దామా..

(ఫొటో సోర్స్‌ : ట్విటర్‌)

* భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఇరు జట్ల అభిమానులు ఓ యుద్ధంలా భావిస్తారు. స్టేడియంలో, టీవీల ముందు మ్యాచ్‌ను అలాగే వీక్షిస్తారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు మాత్రం ఎంతో కూల్‌గా కనిపించారు. ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా మెలిగారు. మ్యాచ్‌ మధ్యలో పాక్‌ వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ను ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కౌగిలించుకుని తన స్నేహతత్వాన్ని చాటుకున్నాడు. దానికి అంతే సంతోషంగా రిజ్వాన్‌ ప్రతిస్పందించాడు.

* ఇక ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి కింగ్‌ కోహ్లీపైనే. అతడికి పాక్‌లో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ సమయంలో విరాట్‌.. ఓ పాక్‌ అభిమానిని ప్రత్యేకంగా కలవడం విశేషం. ‘మారో ముజే మారో’ మీమ్‌తో ఎంతో పేరు తెచ్చుకున్న ఆ అభిమాని.. కోహ్లీ వచ్చి కలవడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. గొప్ప ఆటగాడు, నిరాండబరమైన వ్యక్తిత్వం కలిగిన వన్‌ అండ్‌ ఓన్లీ కోహ్లీ.. మళ్లీ ఫామ్‌లోకి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘ఈ మ్యాచ్‌ ఎంతో అద్భుతంగా సాగింది. మిమ్మల్ని ఫైనల్‌లో చూడాలనుకుంటున్నాం’’ అని ఆ అభిమాని ట్విటర్‌లో పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

* కోహ్లీకి సంబంధించిన ఇంకో ఘటన కూడా ఆకట్టుకుంటోంది. మ్యాచ్‌ అనంతరం పాక్‌ ఆటగాడు రౌఫ్‌తో కోహ్లీ ముచ్చటించాడు. అనంతరం తాను సంతకం చేసిన జెర్సీని అతడికి బహూకరించి గొప్ప మనసును చాటుకున్నాడు. కోహ్లీలాంటి దిగ్గజం నుంచి జెర్సీ అందడంతో ఆ పాక్‌ ఆటగాడు ఉబ్బితబ్బిబయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని