T20 World Cup: సూపర్‌-8పై కన్నేసిన అఫ్గాన్, అమెరికా

సూపర్‌-8పై కన్నేసిన అఫ్గానిస్థాన్, అమెరికా జట్లు ముఖ్యమైన మ్యాచ్‌లకు సిద్ధమయ్యాయి. శుక్రవారం గ్రూప్‌-సిలో పాపువా న్యూగినీతో అఫ్గానిస్థాన్‌ తలపడుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన అఫ్గాన్‌కు పాపువా నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవచ్చు.

Published : 14 Jun 2024 03:45 IST

తరౌబా (ట్రినిడాడ్‌): సూపర్‌-8పై కన్నేసిన అఫ్గానిస్థాన్, అమెరికా జట్లు ముఖ్యమైన మ్యాచ్‌లకు సిద్ధమయ్యాయి. శుక్రవారం గ్రూప్‌-సిలో పాపువా న్యూగినీతో అఫ్గానిస్థాన్‌ తలపడుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన అఫ్గాన్‌కు పాపువా నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవచ్చు. అఫ్గాన్‌ గెలిస్తే ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ కథ ముగుస్తుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కివీస్‌.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినా ఉపయోగం ఉండదు. ఈ గ్రూప్‌ నుంచి విండీస్‌ ఇప్పటికే మూడు విజయాలతో సూపర్‌-8లో అడుగుపెట్టింది. మరోవైపు అమెరికా గ్రూప్‌-ఎలో ఐర్లాండ్‌తో తలపడుతుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచిన అమెరికా.. ఈ మ్యాచ్‌లో నెగ్గితే సూపర్‌-8లో ప్రవేశిస్తుంది. అప్పుడు పాకిస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌ ఇప్పటికే ముందంజ వేసిన సంగతి తెలిసిందే. వర్షం వల్ల ఐర్లాండ్‌-అమెరికా మ్యాచ్‌ జరగకపోయినా పాక్‌ ఇంటిముఖం పడుతుంది. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే అమెరికా అయిదు పాయింట్లతో ముందంజ వేయగలదు. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్స్‌లో జరగాల్సివున్న ఈ మ్యాచ్‌ రద్దయ్యే అవకాశాలు ఉండడం పాక్‌కు ఆందోళన కలిగిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఫ్లోరిడాలో జనజీవనం స్తంభించింది. బుధవారం శ్రీలంక, నేపాల్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దయింది. ఐర్లాండ్‌తో పోరులో ఓడినా.. అమెరికా సూపర్‌-8 రేసులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు