SA vs AFG: చేతులెత్తేసిన అఫ్గాన్‌ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా లక్ష్యం 57

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో సెమీస్‌-1 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ బ్యాటర్లు ఆలౌటయ్యారు.

Updated : 27 Jun 2024 07:26 IST

ట్రినిడాడ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ట్రినిడాడ్‌ వేదికగా జరుగుతున్న సెమీఫైనల్‌-1 మ్యాచ్‌లో అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇప్పటివరకు అసాధారణ ప్రతిభ కనబరిచిన అఫ్గాన్‌ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆలౌటయ్యారు. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (10) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుసగా వికెట్లు పడగొడుతూ అఫ్గాన్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్లు గుర్బాజ్‌ (0), జర్దాన్‌ (2), తొలి డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) పూర్తిగా విఫలమయ్యారు.

ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒమర్జాయ్‌ ప్రయత్నించాడు. కానీ, నోకియా బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (8) కూడా ఆకట్టుకోలేక పోయాడు. నబీ (0), జనత్‌ (8), నూర్ ఆహ్మద్‌ (0), నవీనుల్‌ హక్‌ (2) ప్రభావం చూపలేకపోయారు. ఫరూకీ (2*) నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌, షంసీ చెరో 3 వికెట్లు తీయగా.. రబాడా, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని