PAK vs AFG: చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్.. పాకిస్థాన్‌పై తొలి విజయం
టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించి అఫ్గానిస్థాన్ (Afghanistan) సంచలనం సృష్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఫ్గానిస్థాన్ (Afghanistan).. తనకన్నా బలమైన పాకిస్థాన్ (Pakistan)కు షాక్ ఇచ్చింది. ఇరుజట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో పాక్‌ని అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కిదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ లేకుండా బరిలోకి దిగిన పాక్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన పాకిస్థాన్‌ను ఇమాద్ వసీమ్ (18) ఆదుకున్నాడు. లేకుంటే ఆ జట్టు టీ20ల్లో తన అత్యల్ప స్కోరు 74 (2012లో ఆస్ట్రేలియాపై) కంటే తక్కువకే ఆలౌటయ్యేది. లక్ష్యఛేదనలో 10 ఓవర్లకు 45/4 స్కోరుతో కష్టాల్లో ఉన్న అఫ్గానిస్థాన్‌ను మహమ్మద్ నబీ (38), నజీబుల్లా జద్రాన్ (17) నిలకడగా ఆడి గెలిపించారు.
‘‘పాక్‌పై మేం చాలాసార్లు స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఇప్పుడు ఆ జట్టుపై తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మున్ముందు ఇదే జోరును కొనసాగించాలకుంటున్నాం. అఫ్గానిస్థాన్ తరఫున ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. షార్జాలో పిచ్ గురించి మాకు తెలియదు. ఇక్కడి పిచ్ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం టాప్ ఆర్డర్‌ను మెరుగుపర్చుకోవాలి’’ అని మ్యాచ్ అనంతరం అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: షూటింగ్లో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు