టీమ్‌ఇండియాపై అఫ్గాన్‌ సెల్ఫ్‌గోల్‌

అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది టీమ్‌ఇండియా. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌, ఆసియా కప్‌నకు సంయుక్తంగా జరుగుతున్న అర్హత పోటీల్లో అఫ్గాన్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ప్రత్యర్థి సెల్ఫ్‌ గోల్‌ చేసుకొని వెనకబడినా ఛెత్రీ బృందం దానిని నిలబెట్టుకోలేదు...

Updated : 13 Sep 2022 15:36 IST

అయినా గెలవని ఛెత్రీ సేన

(సెల్ఫ్‌ గోల్‌ దృశ్యం)

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంది టీమ్‌ఇండియా. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌, ఆసియా కప్‌నకు సంయుక్తంగా జరుగుతున్న అర్హత పోటీల్లో అఫ్గాన్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ప్రత్యర్థి సెల్ఫ్‌ గోల్‌ చేసుకొని వెనకబడినా ఛెత్రీ బృందం దానిని నిలబెట్టుకోలేదు.

మంగళవారం రాత్రి అల్‌సద్‌ స్టేడియంలో భారత్‌, అఫ్గానిస్థాన్‌ తలపడ్డాయి. 74 నిమిషాల వరకు ఏ జట్టూ గోల్‌ చేయలేదు. రెండు జట్లూ బంతిని తమ అధీనంలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాయి. 75వ నిమిషంలో టీమ్ఇండియాకు అనుకోని లాభం చేకూరింది. అఫ్గాన్‌ గోల్‌కీపర్‌ పొరపాటున సెల్ఫ్‌ గోల్‌ చేశాడు.

మన్వీర్‌సింగ్‌ తన ఎడమవైపు బంతిని అందంగా ఫ్లిక్‌ చేశాడు. దానిని ఆశిఖ్‌ కురునియన్‌ గోల్‌పోస్ట్‌ వైపు కిక్‌ ఇచ్చాడు. టీమ్‌ఇండియా సారథి ఛెత్రీ దానిని క్రాస్‌ చేస్తాడని భావించాడు. గాల్లోకి ఎగిరిన అఫ్గాన్‌ గోల్‌కీపర్‌ ఓవైస్‌ అజిజి బంతిని అందుకోవడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యర్థి జట్టు  భావించింది. కానీ ఆ బంతిని కాళ్లకిందకు విసరడంతో అదికాస్తా అనూహ్యంగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి చేరుకుంది. దొరికిన అవకాశాన్ని ఛెత్రీసేన నిలబెట్టుకోలేకపోయింది. 82వ నిమిషంలో హుస్సేన్‌ జమాని అద్భుతమైన గోల్‌తో స్కోరును సమం చేశాడు. భారత్‌కు రెండో విజయం దక్కకుండా అడ్డుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు