Asia Cup 2023: ఆసియా కప్‌ జట్టును ప్రకటించిన అఫ్గానిస్థాన్‌.. కరీమ్‌కు ఆరేళ్ల తర్వాత పిలుపు

గస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) జరగనుంది. ఈ టోర్నీ  కోసం అఫ్గానిస్థాన్‌ తమ జట్టును ప్రకటించింది.

Published : 27 Aug 2023 19:56 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) జరగనుంది. ఆరు దేశాలు పాల్గొనే ఈ మినీ టోర్నీ పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ  కోసం అఫ్గానిస్థాన్‌ తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిదీ కెప్టెన్‌గా 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. టీ20ల్లో కీలకంగా ఉన్న ఆల్‌రౌండర్‌ కరీమ్‌ జనత్‌కు ఆరేళ్ల తర్వాత వన్డే జట్టులో చోటుదక్కింది. 2017 ఫిబ్రవరిలో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన అతడు.. తర్వాత ఒక్క వన్డేలోనూ ఆడలేకపోయాడు. శ్రీలంక, పాకిస్థాన్‌ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో నలుగురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నారు. ఆసియా కప్‌లో అఫ్గాన్‌ సెప్టెంబరు 3న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.  

అఫ్గానిస్థాన్‌ జట్టు: 

హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్,ఫజల్ ఉక్‌ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహమాన్, మహ్మద్ సలీమ్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని