T20 world cup Semi Final Race: అఫ్గాన్‌ సంచలన విజయం.. మారిన సెమీస్‌ లెక్కలు..

సూపర్‌ 8లో ఆస్ట్రేలియాకు అఫ్గాన్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఈ ఫలితంలో గ్రూప్‌ 1 సెమీస్‌ సమీకరణాలు మారిపోయాయి.

Published : 23 Jun 2024 17:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ చరిత్ర సృష్టించింది. బలమైన జట్టు ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో సూపర్‌ 8 నుంచి సెమీస్‌ చేరే లెక్కలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రూప్‌ 1 నుంచి ఏయే జట్లకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం..

  • సూపర్‌ 8లో వరుసగా రెండు విజయాలతో టీమ్‌ఇండియా దాదాపు సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. చివరి మ్యాచ్‌లో జూన్‌24న ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఇందులో విజయం సాధిస్తే.. సగర్వంగా సెమీస్‌కు చేరుతుంది.
  • ఆస్ట్రేలియా చేతిలో ఓడినా టీమ్‌ఇండియాకు ముందంజ వేసే ఛాన్స్‌ ఉంటుంది. మెరుగైన రన్‌రేట్‌ ఉండటమే కారణం.
  • ఆస్ట్రేలియా పరిస్థితే కాస్త తారుమారైంది. అఫ్గాన్‌పై ఓటమి ఆ జట్టు సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఆడిన రెండింట్లో ఒకే విజయాన్ని నమోదు చేసిన ఆ జట్టు.. తన చివరి మ్యాచ్‌లో భారత్‌పై తప్పక గెలవాల్సి ఉంటుంది. ఓడితే దాదాపు ఇంటికే.
  • ఆసీస్‌పై సంచలన విజయంతో అఫ్గాన్‌ సెమీస్‌ రేసులోకి వచ్చింది. చివరి మ్యాచ్‌లో బంగ్లాపై విజయం సాధిస్తే దాని సెమీస్‌ అవకాశాలు మరింత మెరుగవుతాయి. అప్పుడు భారత్‌పై ఆసీస్‌ ఓడితే అఫ్గాన్‌ నేరుగా సెమీస్‌కు చేరుతుంది.
  • ఒకవేళ సూపర్‌ 8 ముగిసే నాటికి భారత్, ఆసీస్, అఫ్గాన్‌ రెండేసి విజయాలతో నిలిస్తే.. మెరుగైన రన్‌రేట్‌ కలిగిన రెండు జట్లు ముందంజ వేస్తాయి.
  • ఒకవేళ ఆసీస్‌, అఫ్గాన్‌ తమ తర్వాత మ్యాచ్‌ల్లో ఓడితే.. ఒక్కో విజయం సాధించిన జట్లు మూడవుతాయి. అప్పుడు ఈ మూడింట్లో మెరుగైన రన్‌ రేట్‌ ఉన్న జట్టు.. భారత్‌తోపాటు సెమీస్‌ చేరుతుంది.
  • ఇక ఆడిన రెండింట్లో ఓడిన బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని