Rahul Dravid: కేకేఆర్‌ ఫ్రాంఛైజీ మెంటార్‌గా ద్రవిడ్‌?

భారత ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు దాదాపు ఖరారైనట్లే. ఈ క్రమంలో మెంటార్‌గా ఉండేందుకు ద్రవిడ్‌తో కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. 

Published : 09 Jul 2024 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2024 టీ20 ప్రపంచకప్‌తో భారత ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ పేరు దాదాపు ఖారారైనట్లే. ప్రస్తుతం ఇండియన్ ప్రిమియర్‌ లీగ్‌ (IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR) మెంటార్‌గా గంభీర్‌ వ్యవహరిస్తున్నాడు. గంభీర్‌ టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రావడం ఖాయం కావడంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొత్త మెంటార్‌ను నియమించుకునే పనిలో పడింది. కేకేఆర్‌కు మెంటార్‌గా ఉండాలని రాహుల్ ద్రవిడ్‌ను ఫ్రాంఛైజీ సంప్రదించినట్లు సమాచారం. 2024 ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు కేకేఆర్‌ మెంటార్‌గా గంభీర్‌ నియమితులయ్యారు. సహా యజమాని అయిన షారుక్‌ అతనికి 10 సంవత్సరాల అగ్రిమెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ.. బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో గంభీర్‌ అటు మెగ్గు చూపినట్లు సమాచారం. గంభీర్‌ వెళ్లిపోతాడని గ్రహించిన కేకేఆర్‌ ఫ్రాంఛైజీ ద్రవిడ్‌ పేరును షార్ట్‌ లిస్ట్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని