- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
IND vs ENG : జాత్యహంకార వ్యాఖ్యల కలకలం.. స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌లో మరోసారి ‘జాత్యంహకార’ సంఘటన తలెత్తడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. ఇంతకుముందు కౌంటీల్లోనూ ఇదే తరహా ఆరోపణలతో మాజీ క్రికెటర్ అజీమ్ రఫీఖ్ వ్యవహారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న టెస్టు మ్యాచ్ వేదిక ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలోనూ ఇలాంటి ఆరోపణలే రావడం సంచలనంగా మారింది. భారత అభిమానుల పట్ల పలువురు జాత్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పందించింది. ‘‘టెస్టు మ్యాచ్ సందర్భంగా జాత్యంహకార వేధింపులకు సంబంధించి నివేదికను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. క్రికెట్లో వీటికి చోటు లేదు’’ అని ట్విటర్లో పేర్కొంది.
జాత్యంహకార సంఘటన తలెత్తిన నేపథ్యంలో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇటువంటి సంఘటనలను ఉపేక్షించకూడదని ఖండించారు. తాజా ఘటనపై అజీమ్ రఫీఖ్ కూడా ట్వీట్ చేశాడు. దీనిపై ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ క్షమాపణలు చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ధోరణిని సహించేదిలేదని స్పష్టం చేసింది. సంఘటనపై విచారణ చేపడతామని వెల్లడించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూస్తామని, ట్వీట్లు చేసిన సదరు వ్యక్తితో పర్సనల్‌గా మాట్లాడినట్లు సీఈవో స్టువర్ట్ కెయిన్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Hardik : హార్దిక్ ఫుల్ స్వింగ్‌లో ఉంటే భారత్‌ను తట్టుకోలేం: జింబాబ్వే బ్యాటింగ్ కోచ్
-
Movies News
Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
-
General News
18న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
-
Politics News
Munugode: మునుగోడులో కాంగ్రెస్‌కు మద్దతుపై ఆలోచిస్తాం: కోదండరాం
-
World News
Putin: ప్రపంచంపై ‘పెత్తనం’ కోసమే అమెరికా ప్రయత్నాలు : పుతిన్
-
Sports News
Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- RRR: ఆస్కార్‌కు ‘ఆర్ఆర్ఆర్’.. నామినేట్ అయ్యే ఛాన్స్ ఎంతంటే?
- Hardik : హార్దిక్ ఫుల్ స్వింగ్‌లో ఉంటే భారత్‌ను తట్టుకోలేం: జింబాబ్వే బ్యాటింగ్ కోచ్
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!