Faf du plessis: డుప్లెసిస్‌ బ్యాటింగ్‌తో చెన్నై అభిమానుల నిరాశ.. నెట్టింట్లో సరదా మీమ్స్‌

పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (88; 57 బంతుల్లో 3x4, 7x6) దంచికొట్టడంతో చెన్నై అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు...

Published : 29 Mar 2022 02:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (88; 57 బంతుల్లో 3x4, 7x6) దంచికొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బందిపడినప్పటికీ.. తర్వాత క్రీజులో కుదురుకున్నాక రెచ్చిపోయాడు. తొలి 30 బంతుల్లో 17 పరుగులే చేసిన అతడు తర్వాత పంజాబ్‌ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే మిగతా 27 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అయితే డుప్లెసిస్‌ బ్యాటింగ్‌ చూసిన చెన్నై అభిమానులు నిరాశకు గురయ్యారు. అతడి ఆటతీరుపై సామాజిక మాధ్యమాల్లో సరదా మీమ్స్‌ పోస్టు చేశారు.

కాగా, ఈ సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించిన నేపథ్యంలో అన్ని జట్లూ తమ కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకొని మిగతా అందర్నీ వదిలేసుకున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై కూడా తమ ఓపెనర్‌ డుప్లెసిస్‌ను వదిలేసుకుంది. అయితే, వేలంలో బెంగళూరు జట్టు ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ను రూ.7కోట్లకు కొనుగోలు చేసింది. ఇక కొద్ది రోజుల క్రితమే కెప్టెన్‌గానూ నియమించింది. దీంతో డుప్లెసిస్‌ తొలి మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడి.. త్రుటిలో శతకం కోల్పోయాడు. అయితే, ఇప్పుడు బెంగళూరు తరఫున అతడి బ్యాటింగ్‌ చూసి చెన్నై యాజమాన్యం బాధపడి ఉంటుందని అభిమానులు మీమ్స్‌తో అలరిస్తున్నారు. మీరూ వాటిని చూసి సరదాగా నవ్వుకోండి.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని