IND vs NZ: అజాజ్‌ పటేల్‌పై ప్రశంసల వెల్లువ.!

ముంబయి వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శనతో రికార్డు సృష్టించిన అజాజ్‌ పటేల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు దిగ్గజ క్రికెటర్లు సామాజిక..

Published : 04 Dec 2021 17:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శనతో రికార్డు సృష్టించిన అజాజ్‌ పటేల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు దిగ్గజ క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో అజాజ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. టీమ్‌ఇండియా మాజీ దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.. పది వికెట్ల క్లబ్‌లోకి స్వాగతం అని ట్వీట్‌ చేశాడు. రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌, వసీం జాఫర్‌, ఆరోన్‌ ఫించ్ తదితరులు అజాజ్‌ను ప్రశంసించారు. 

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాను.. అజాజ్ పటేల్‌ 325 పరుగులకు ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 47.5 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన అజాజ్‌ 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 1999లో పాకిస్థాన్‌పై అనిల్‌ కుంబ్లే ఈ ఘనత తర్వాత.. మళ్లీ 22 ఏళ్లకు సరికొత్త రికార్డు నమోదైంది. అంతకు ముందు ఇంగ్లాండ్‌ బౌలర్‌ జిమ్‌ లేకర్‌ 1956లో ఆస్ట్రేలియాపై తొలిసారి 10 వికెట్ల ప్రదర్శన చేశాడు.












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని