
IND vs NZ: రహానె నిరూపించుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశం : గౌతమ్ గంభీర్
ఇంటర్నెట్ డెస్క్: అజింక్య రహానె బ్యాటింగ్‌లో సత్తా చాటేందుకు త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ ఓ మంచి అవకాశమని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తొలి టెస్టుకు విరాట్ కోహ్లి గైర్హాజరీతో రహానె కెప్టెన్‌గానూ వ్యవహరించనున్నాడు. గత కొద్ది రోజులుగా రహానె ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. చివరి సారిగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రహానె ఓ శతకం, మరో అర్ధ శతకంతో రాణించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కీలక ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. కరోనా కారణంగా ఇంగ్లాండ్‌తో అర్ధాంతరంగా వాయిదా పడిన టెస్టు సిరీస్‌లో కూడా రహానే ఘోరంగా విఫలమై.. జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.
‘త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టుకు రహానె కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోవాలి. బ్యాటింగ్‌లో తన సత్తా చాటేందుకు ఇదో సువర్ణావకాశం. అలాగే, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగాలి. శుభ్‌మన్ గిల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించాలి’ అని గంభీర్ సూచించాడు. న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య నవంబరు 25 నుంచి కాన్పుర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.