Ajinkya Rahane: ఐపీఎల్-15 సీజన్‌ తర్వాత లీసెస్టర్‌షైర్‌కు ఆడనున్న అజింక్య రహానె

టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane) ఐపీఎల్‌లో ప్రస్తుతం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 15 సీజన్‌ పూర్తయిన అతడు కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లనున్నాడు.

Published : 31 Jan 2023 22:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 15 సీజన్‌ ముగిసిన అనంతరం భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె 8 కంట్రీ ఛాంపియన్‌షిప్ 2023, రాయల్ లండన్ వన్ డే కప్‌లో లీసెస్టర్‌షైర్ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు మంగళవారం లీసెస్టర్‌షైర్‌తో రహానె ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు కౌంటీ క్రికెట్‌ ఆడటం ఇది రెండోసారి. 2019లో హాంప్‌షైర్‌ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో రహానె ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

జూన్‌లో జట్టుతో చేరి 8 కంట్రీ ఛాంపియన్‌షిప్‌ తరఫున మ్యాచ్‌లు ఆడనున్నాడు. మరోవైపు, ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 16 వరకు జరిగే రాయల్ లండన్‌ వన్‌ డే కప్‌లో రహానె అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు. రహానె భారత జట్టుకు ఆడి చాలా రోజులైంది. అతడు టీమ్ఇండియా తరఫున చివరిగా జనవరి 2022లో సౌతాఫ్రికాతో  టెస్టులో ఆడాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో రహానె మంచి ప్రదర్శన కనబరిచాడు. ఏడు మ్యాచ్‌ల్లో 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు. ఇందులో ఓ  డబుల్‌ సెంచరీ కూడా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని