Ajinkya Rahane : చిన్ననాటి స్కూల్‌ని సందర్శించిన అజింక్య రహానె.!

టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్ట్‌ అజింక్య రహానె చిన్నప్పుడు చదువుకున్న ‘ఎస్సీ జోషి హై స్కూల్’ని సందర్శించాడు. తన భార్య రాధిక, కుమార్తె ఆర్యతో కలిసి వెళ్లిన అతడు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు..

Published : 10 Mar 2022 01:49 IST

(Photo : Rahane Instagram)

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్ట్‌ అజింక్య రహానె చిన్నప్పుడు చదువుకున్న ‘ఎస్సీ జోషి హై స్కూల్’ని సందర్శించాడు. తన భార్య రాధిక, కుమార్తె ఆర్యతో కలిసి వెళ్లిన అతడు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నాడు.    

‘మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలను వెతుక్కుంటూ వెళ్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి రావాలనుకున్నాను. నా కోరిక ఈ రోజు తీరింది. నా కుటుంబంతో కలిసి డొంబివ్లీలో నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్‌ని, ఆడుకున్న మైదానాన్ని సందర్శించాను. ఇక్కడే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాను. మా ఉపాధ్యాయులు కూడా నాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. మా స్కూళ్లో అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చినా.. నా హృదయంలో మాత్రం వాటికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడికి రాగానే ఏదో తెలియని కొత్త అనుభూతి కలిగింది’ అని రహానె చెప్పాడు.

ఫామ్‌లేమితో సతమతమవుతున్న అజింక్య రహానె.. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం రంజీల్లో ముంబయి జట్టు ఆడుతున్న రహానె.. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచులో శతకం నమోదు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగావేలంలో రహానెను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టు దక్కించుకున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని