Updated : 08 Feb 2022 10:52 IST

Virat Kohli: ఆర్సీబీకి డబ్బులు లేకపోతే.. కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ చేపడితేనే మంచిది

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ మళ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీని చేపడితే ఆ జట్టుకు మంచిదని మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్‌ 14వ సీజన్‌ పూర్తయిన వెంటనే విరాట్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే సీజన్‌ కోసం ఆర్సీబీ కొత్త సారథిని తీసుకోవాల్సిన అవసరముంది. అందుకోసం ఈ వారాంతం జరిగే ఐపీఎల్‌ మెగా వేలంలోనే నూతన సారథిని కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే అజిత్‌ అగార్కర్‌ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఆ జట్టు సారథ్య అంశంపై స్పందించాడు.

‘కోహ్లీ మళ్లీ సంతోషంగా ఆ జట్టు పగ్గాలు అందుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆర్సీబీకి అదే మంచిది. దాంతో వాళ్ల పని తేలికవుతుంది. బెంగళూరు ఫ్రాంఛైజీ కొన్నేళ్లుగా సరైన కోర్‌ జట్టును కొనుగోలు చేసేందుకు తగినంత మొత్తం వెచ్చించలేదని మనందరికీ తెలిసిందే. ఆ జట్టు ఎప్పుడూ టాప్‌ 3 ఆటగాళ్లపైనే ఆధారపడింది. మిడిల్‌ఆర్డర్‌లో సరైన ఆటగాళ్లను తీసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా ఆ జట్టు వద్ద తగినంత సొమ్ము లేకపోతే ఒక్క ఆటగాడి కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అతడెంత మేటి ఆటగాడైనా మ్యాచ్‌లు గెలిపిస్తాడు కానీ.. టైటిళ్లు అందించలేడు’ అని అగార్కర్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, ప్రస్తుతం ఆర్సీబీ వద్ద రూ.57 కోట్లు ఉండగా.. మెగా వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ మాజీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ను కొనుగోలు చేయాలని చూస్తోంది. అందుకోసం భారీ మొత్తం వెచ్చించే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ నిజంగానే శ్రేయస్‌ను తీసుకుంటుందా.. లేక తమ వద్దే అట్టిపెట్టుకున్న మాక్స్‌వెల్‌కు కెప్టెన్సీ అవకాశం ఇస్తుందా చూడాలి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని