Aus vs WI: ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు.. అవేంటంటే?

వెస్టిండీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (67) తీసిన బౌలర్‌గా నిలిచాడు. అడిలైడ్ ఓవల్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో ఈ ఘనత అందుకున్నాడు. ఇదే మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌ లబుషేన్ కూడా ఓ రికార్డు సాధించాడు.

Published : 10 Dec 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెస్టిండీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (67) తీసిన బౌలర్‌గా నిలిచాడు. అడిలైడ్ ఓవల్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో ఈ ఘనత అందుకున్నాడు. రెండో రోజు ఆటలో ఆసీస్‌ బ్యాటర్‌ కామెరూన్‌  గ్రీన్‌ (9)న ఔట్‌ చేయడం ద్వారా ఈ రికార్డును అందుకున్నాడు. అల్జారీ జోసెఫ్‌ 34 మ్యాచ్‌ల్లో 67 వికెట్లతో ఈ జాబితాలో టాప్‌ ఉండగా.. నేపాల్ బౌలర్‌ స్దీప్‌ లామిచానె 33 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు. 

ఇదే మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌ లబుషేన్ కూడా ఓ రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 51 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించిన లబుషేన్‌.. వెస్టిండీస్‌ దిగ్గజం ఎవర్టన్‌ వీక్స్‌ సరసన నిలిచాడు. ఎవర్టన్‌ కూడా 51 ఇన్నింగ్స్‌ల్లోనే 3 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌ క్రికెట్ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ (33) ఇన్నింగ్స్‌ల్లోనే 3 వేల పరుగులు పూర్తి చేసుకుని తొలి స్థానంలో ఉన్నాడు.  

ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. 2001లో అతడు 45 మ్యాచ్‌లు ఆడి 136 వికెట్లు,  2006లో 40 మ్యాచ్‌లు 128 వికెట్లు తీసి తొలి రెండు స్థానాల్లో నిలిచాడు. ఆసీస్ మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ (120 వికెట్లు.. 1994) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టాప్‌ 15లో భారత్‌ తరఫున ఒక్కరే చోటు దక్కించుకున్నారు. హర్భజన్‌ సింగ్‌ (102 వికెట్లు.. 2002) 15వ స్థానంలో నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని