Ambati Rayudu: ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు

సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచే తన కెరీర్‌లో చివరిదని వెల్లడించాడు.

Updated : 28 May 2023 18:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచే తన కెరీర్‌లో చివరిదని వెల్లడించాడు. ఈ మేరకు  ట్వీట్ చేశాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాయుడు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 203 మ్యాచ్‌లు ఆడి 28.29 సగటుతో 4,329 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది. 

2010-2017 వరకు ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాయుడు.. నిలకడగా ఆడుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ముంబయిని ఒంటిచేత్తో గెలిపించాడు. ఇప్పటివరకు ఐదు టైటిల్స్‌ను గెలుచుకున్న అంబటి రాయుడు.. నేడు గుజరాత్‌పై చెన్నై గెలిస్తే ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంటాడు. ముంబయి ఇండియన్స్‌ తరఫున (2013, 2015, 2017).. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున (2018, 2021)లో టైటిల్‌ను అందుకున్నాడు. 2018లో సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో రాయుడిదే కీలకపాత్ర. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 43 సగటుతో 602 పరుగులు సాధించాడు. అదే సీజన్‌లో ఐపీఎల్‌లో శతకాన్ని నమోదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని