Sunil Gavaskar: అలాంటప్పుడు.. అక్కడ మ్యాచ్‌లు నిర్వహించొద్దు: సునీల్ గావస్కర్ ఆగ్రహం

తొలిసారి మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో సరైన సదుపాయాలు మాత్రం కానరావడం లేదు. ప్రాక్టీస్‌ చేసుకోవడానికి, జిమ్‌ చేసుకోవడానికి భారత ఆటగాళ్లు ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ను రద్దు చేసిన పరిస్థితి తలెత్తింది.

Published : 17 Jun 2024 12:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడంతో.. ఆ ప్రభావం కొన్ని జట్లపై తీవ్రంగా పడింది. మరీ ముఖ్యంగా యూఎస్‌ఏలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. మరికొన్ని మ్యాచ్‌లకు వర్షం ఆగినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆడేందుకు వీల్లేకుండా పోయింది. భారత్-కెనడా మ్యాచ్‌ ఇలానే రద్దైంది. దీనిపై టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీస సదుపాయాలు లేనిచోట మ్యాచ్‌లను నిర్వహించిన ఐసీసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

రెండు గ్రూప్‌లుగా సూపర్‌-8.. ఆ టీమ్‌లు ఇవే

‘‘ఐసీసీకి నాదొక విన్నపం. మొత్తం మైదానాన్ని కప్పడానికి కవర్లు లేనిచోట మ్యాచ్‌లు నిర్వహించకూడదు. ఒక్క పిచ్‌నే కప్పి మైదానంలోని మిగతా ప్రాంతాలను వదిలేయకూడదు. స్టార్‌ క్రికెటర్లను చూసేందుకు భారీగా అభిమానులు మైదానానికి వస్తారు. వారిని నిరుత్సాహపరచడం సరైంది కాదు’’ అని గావస్కర్‌ అన్నాడు. ఫ్లోరిడా మైదానంలోని సదుపాయాలపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్‌ కూడా స్పందించాడు.  ‘‘భారీ టోర్నీలో ఇలాంటివి చోటు చేసుకోవడం విచిత్రంగా ఉంది. మైదానాన్ని పూర్తిగా కప్పడానికి కవర్లు ఎందుకు లేవో అర్థం కావట్లేదు. ఇంత డబ్బున్నా.. ఔట్‌ఫీల్డ్‌ పచ్చిగా ఉన్నందున ఇప్పటికీ మ్యాచ్‌లు రద్దువుతున్నాయి’’ అని వాన్‌ వ్యాఖ్యానించాడు.

దూబెతో బౌలింగ్‌ చేయించకపోతే..: శ్రీశాంత్‌

‘‘శివమ్‌ దూబె ఆల్‌రౌండర్. అతడు మీడియం పేస్‌ బౌలింగ్‌ కూడా వేయగలడు. కానీ, భారత మేనేజ్‌మెంట్‌ అతడితో బౌలింగ్‌ చేయించడం లేదు. యూఎస్‌ఏపై నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాడు. అయితే, దూబెతో బౌలింగ్‌ వేయించకపోతే అతడి స్థానంలో బెటర్ బ్యాటర్‌ను తీసుకోవడం మేలు. సంజూశాంసన్‌ తుది జట్టులో ఉంటే ఫినిషింగ్‌ బాగుంటుందని భావిస్తున్నా. దూబెను బౌలర్‌గానూ వినియోగించుకోవాలని అనుకుంటే అతడే సరైన ఎంపిక అవుతుంది. అలాకాకుండా బ్యాటర్‌గానే ఆడిస్తే సంజూకు అవకాశం ఇవ్వొచ్చు. ఛాన్స్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. తప్పకుండా తనను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు’’’ అని శ్రీశాంత్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని