T20 League : మరొక దిల్లీ ఆటగాడికి కరోనా.. పంజాబ్‌తో మ్యాచ్‌పై సందిగ్ధం!

 టీ20 లీగ్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. ఇప్పటికే...

Updated : 20 Apr 2022 18:08 IST

ముంబయి: టీ20 లీగ్‌లో మరోసారి కరోనా కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే దిల్లీకి చెందిన నలుగురు సిబ్బందితోపాటు విదేశీ క్రికెటర్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో పంజాబ్‌తో మ్యాచ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరొక విదేశీ ఆటగాడికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. అయితే దిల్లీ యాజమాన్యం కానీ టీ20 లీగ్‌ నిర్వాహకులు కానీ ధ్రువీకరించలేదు. ఇప్పటికే దిల్లీ, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ వేదికను బీసీసీఐ మార్చింది. పుణె నుంచి ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియంలోనే మ్యాచ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మరొక ఆటగాడికి కరోనా సోకినట్లు నిర్థరణ అయితే మాత్రం మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేసే అవకాశాలు లేకపోలేదని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుత సీజన్‌లో దిల్లీ ఫిజియో ప్యాట్రిక్‌ ఫార్‌హత్‌ తొలిసారిగా ఏప్రిల్‌ 15న కరోనా బారిన పడ్డాడు. తర్వాత స్పోర్ట్స్‌ మసాజ్‌ థెరపిస్ట్‌ చేతన్‌ కుమార్, విదేశీ ఆటగాడు మిచెల్ మార్ష్,  టీమ్‌ వైద్యుడు డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి, సోషల్‌ మీడియా కంటెంట్ టీమ్‌ సభ్యుడు ఆకాశ్‌ మనే కొవిడ్‌ పాజిటివ్‌గా తేలారు. కరోనా కారణంగానే గత సీజన్‌ పోటీలను రెండు దశల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. తొలి దశ భారత్‌లో, మలి దశ యూఏఈ వేదికగా పోటీలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని