Anshu Malik : ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు పతకాలు

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. మూడు విభాగాల్లో..

Published : 22 Apr 2022 23:05 IST

(ఫొటో సోర్స్‌: శాయ్‌ ట్విటర్‌)

మంగోలియా: ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. మూడు విభాగాల్లో పతకాలను సాధించారు. 57 కేజీల విభాగంలో అన్షు మాలిక్, 65 కేజీల విభాగంలో రాధిక రజత పతకాలను కైవసం చేసుకోగా.. 62 కేజీల విభాగంలో మనీషా కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఫైనల్‌ పోటీలో (57 కేజీలు) జపాన్‌కు చెందిన సుగుమి సకురాయ్‌ చేతిలో 4-0 తేడాతో అన్షు మాలిక్ ఓటమిపాలైంది. గతేడాది ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన అన్షు మాలిక్‌.. ఈసారి మాత్రం సిల్వర్‌కే పరిమితమైంది.

ఇకపోతే, 65 కేజీల విభాగంలో నాలుగు బౌట్లలో మూడింట విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న రాధికకు చుక్కెదురైంది. తుదిపోరులో జపాన్‌కే చెందిన మియా మారికోవాపై ఓటమి చవిచూసింది. 62 కేజీల కేటగిరీలో దక్షిణ కొరియాకు చెందిన హన్‌బిట్ లీ 4-2 తేడాతో రాధికపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలు రవికుమార్‌ దహియా, బజ్‌రంగ్‌ పూనియా శనివారం పతకాల కోసం తలపడనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని