BCCI: కోచ్‌ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం

భారత క్రికెట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌ సహా పలు పోస్టుల భర్తీకి బీసీసీఐ సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రవిశాస్త్రితోపాటు ఇతర కోచ్‌లు, సిబ్బంది కూడా బాధ్యతల నుంచి ..

Updated : 17 Oct 2021 19:26 IST

దిల్లీ: భారత క్రికెట్‌ పురుషుల జట్టుకు హెడ్‌ కోచ్‌ సహా పలు పోస్టుల భర్తీకి బీసీసీఐ సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత ప్రస్తుతం హెడ్‌ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రితోపాటు ఇతర కోచ్‌లు, సిబ్బంది కూడా బాధ్యతల నుంచి దిగిపోనున్నారు. దీంతో హెడ్‌ కోచ్‌, బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లుసహా ఇతర సిబ్బంది భర్తీకి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హెడ్‌ కోచ్‌ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్‌ 26గా, ఇతర పోస్టుల దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్‌ 3గా పేర్కొంది. 

రవిశాస్త్రి పదవికాలం ముగుస్తుండటంతో అతడి స్థానంలో రాహుల్ ద్రావిడ్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలో రాహుల్‌ ద్రావిడ్‌తో చర్చలు జరిపిన బీసీసీఐ బృందం.. హెడ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేయడానికి, ఆ బాధ్యతలు స్వీకరించడానికి ఒప్పించినట్లు సమాచారం. అదే నిజమైతే.. ఆయన నియామకం ఖరారైనట్లే. ప్రస్తుతం బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ భంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌. శ్రీధర్‌ ఉన్నారు. మరి వీరి స్థానాల్లోకి ఎవరు వస్తారో వేచి చూడాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని