Junior Hockey World Cup: ప్రపంచ జూనియర్‌ హాకీ విజేతగా అర్జెంటీనా

పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్‌ పోరులో ఆరు సార్లు విజేత జర్మనీని ఓడించి అర్జెంటీనా కప్పును ఎగురేసుకుపోయింది. 

Updated : 06 Dec 2021 00:41 IST

భువనేశ్వర్‌: పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్‌ పోరులో ఆరు సార్లు విజేత జర్మనీని ఓడించి అర్జెంటీనా కప్పును ఎగురేసుకుపోయింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో అర్జెంటీనా4-2 తేడాతో జర్మనీని ఓడించింది. లాటరో డొమెనె హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగాడు. అందివచ్చిన మూడు ఫెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచాడు. దీంతో 16 ఏళ్ల తర్వాత అర్జెంటీనా మరోసారి జూనియర్‌ ప్రపంచకప్‌ను ముద్దాడింది. 2005లో ఆస్ట్రేలియాపై అర్జెంటీనా 2-1 తేడాతో గెలిచింది. 

ఇక కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఢిపెండింగ్‌ ఛాంపియన్‌ అయిన భారత్‌ కనీసం కాంస్య పతాకమైనా తెస్తుందని ఆశలు పెట్టకున్నప్పటికీ అవి వమ్మయ్యాయి. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో ఫ్రాన్స్‌ పైచేయి సాధిచింది. 3-1 తేడాతో ఫ్రాన్స్‌ భారత్‌ను ఓడించింది. ఆజట్టు కెప్టెన్‌ తిమోథీ క్లెమెంట్‌ అందివచ్చిన అవకాశాలను ఉపయోగించూ హ్యాట్రిక్‌ గోల్స్‌ చేశాడు. ఇక మూడో క్వార్టర్‌లో సుదీప్‌ చిర్‌మాకో ఒక గోల్‌ కొట్టినప్పటికీ అప్పటికే మ్యాచ్‌ విజయావకాశలు ఫ్రాన్స్‌ చేతిలోకి వెళ్లాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని