Copa America: ఈ విజయం డీగోకు అంకితం: మెస్సీ

అర్జెంటీనా స్టార్‌ కెప్టెన్‌ లియొనల్‌ మెస్సీ ఆదివారం సాధించిన కోపా అమెరికా ఫైనల్‌ కప్పును అక్కడి కరోనా బాధితులకు, దివంగత దిగ్గజ ఆటగాడు డీగో మారడోనాకు అంకితమిచ్చాడు....

Published : 12 Jul 2021 18:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అర్జెంటీనా స్టార్‌ కెప్టెన్‌ లియొనల్‌ మెస్సీ ఆదివారం సాధించిన కోపా అమెరికా ఫైనల్‌ కప్పును అక్కడి కరోనా బాధితులకు, దివంగత దిగ్గజ ఆటగాడు డీగో మారడోనాకు అంకితమిచ్చాడు. ఫైనల్లో బ్రెజిల్‌ను 1-0తో చిత్తు చేసిన అర్జెంటీనా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ కప్పును ముద్దాడింది. దీంతో ఆ దేశ ఆటగాళ్లు, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇది మెస్సీ కెరీర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ టోర్నీ విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన అతడు జట్టు విజయాన్ని కొవిడ్‌ బాధిత కుటుంబాలకు, గతేడాది మరణించిన దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు డీగో మారడోనాకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు.

‘నేనీ విజయాన్ని నా కుటుంబసభ్యులకు, స్పేహితులకు, 45 మిలియన్ల అర్జెంటీనా ప్రజలకు, ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో బాధితులుగా మిగిలిన ప్రతి ఒక్కరికీ అంకితమిస్తున్నా. అలాగే గతేడాది కన్నుమూసిన డీగోకు కూడా. ఆయన ఎక్కడున్నా మమ్మల్ని ప్రోత్సహిస్తుంటాడనే నమ్మకం ఉంది. అయితే, ఈ విజయోత్సవాలను మరింత ఎక్కువగా జరుపుకునే క్రమంలో మనమంతా కొవిడ్‌ మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదని మర్చిపోవద్దు. ఈ విజయంతో లభించిన సంతోషం వల్ల కాస్త అయినా బలం తెచ్చుకొని వైరస్‌పై కలిసికట్టుగా పోరాడుదాం. ఈ సందర్భంగా నాకన్నీ ఇచ్చిన ఆ దేవుడికి ధన్యవాదాలు. అలాగే నన్ను అర్జెంటైన్‌గా పుట్టించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు’ అని మెస్సీ భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు