Arjun Tendulkar : ‘‘అర్జున్‌ తెందూల్కర్‌ను చివరి మ్యాచ్‌లో కచ్చితంగా ఆడించాలి’’

ఇప్పటికే టీ20 లీగ్‌ టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయిన ముంబయి తన ఆఖరి మ్యాచ్‌లో దిల్లీతో మే 21న తలపడనుంది. అయితే చివరి మ్యాచ్‌లోనైనా ...

Published : 19 May 2022 02:21 IST

టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే టీ20 లీగ్‌ టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయిన ముంబయి తన ఆఖరి మ్యాచ్‌లో మే 21న దిల్లీతో తలపడనుంది. అయితే చివరి మ్యాచ్‌లోనైనా సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌తో అరంగేట్రం చేయించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా వేలంలో అర్జున్‌ను ముంబయి రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనే అర్జున్‌ డెబ్యూ చేస్తాడని చాలా మంది భావించారు. ముంబయి తుది జట్టులోనూ రెండు మార్పులు చేసినప్పటికీ అర్జున్‌కు చోటు దక్కలేదు. సంజయ్ యాదవ్, మయాంక్‌ మార్కండేలను తీసుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. అర్జున్‌ను తప్పకుండా ఆడించాలని సూచించాడు.

‘‘ముంబయి జట్టుకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఎలాగూ లేవు. అందుకే ప్రతిఒక్క ఆటగాడికి ఛాన్స్‌ ఇవ్వాలి. ఇప్పటివరకు అలానే చేసింది. ఇదే విధంగా అర్జున్‌ తెందూల్కర్‌ను సీజన్‌ చివరి మ్యాచ్‌లో తప్పకుండా ఆడించాలి’’ అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్ చేశాడు. ప్రస్తుత సీజన్‌లో ముంబయి 22 మంది ఆటగాళ్లను ఆడించింది. ఇక మిగిలిన వారిలో అర్జున్ తెందూల్కర్, రాహుల్ బుద్ది, ఆర్యన్‌ జుయల్, అర్షద్‌ ఖాన్‌, ఆకాశ్ మద్వాల్ ఇప్పటివరకు ఆడలేదు. ఇక జోఫ్రా ఆర్చర్‌ ఈ సీజన్‌కే అందుబాటులో లేడు. ప్రస్తుత సీజన్‌లో ముంబయి కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసి పదో స్థానంలో కొనసాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని